Homeజిల్లాలుకామారెడ్డిMunnuru Kapu Trust | మున్నూరు కాపు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

Munnuru Kapu Trust | మున్నూరు కాపు విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

బీర్కూర్​ మండల కేంద్రంలో ఎస్సెస్సీ, ఇంటర్​ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. మున్నూరుకాపు ట్రస్ట్​ హైదరాబాద్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, బీర్కూరు: మండల కేంద్రలో హైదరాబాద్ మున్నూరు కాపు ట్రస్ట్ ​(Munnuru Kapu Trust) ఆధ్వర్యంలో ప్రతిభచూపిన కాపు విద్యార్థులకు శనివారం పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్​లో 90 శాతం మార్కులకుపైగా సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, గోల్డ్‌మెడల్స్‌తో (Gold medals) పాటు రూ.2,000 నగదు పురస్కారాలను అందజేశారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఉపాధ్యాయులు మేకల విఠల్ మాట్లాడుతూ.. మున్నూరు కాపు ట్రస్ట్​ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని అన్నారు. ట్రస్ట్​ ప్రతినిధులు మాట్లాడుతూ.. 20ఏళ్లుగా వెనుకబడిన మున్నూరు కాపు కుటుంబాలకు విద్యా రంగంలో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు చదువు కొనసాగించేందుకు చేయూతనిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ఛైర్మన్ యామ రాములు, సొసైటీ ఛైర్మన్ ఇంగురాములు, ఉపాధ్యాయులు కంఠం శ్రీనివాస్, నారం వెంకటి, సత్యం, మద్దూర్ నర్సింలు, మేకల గాలయ్య, మేకల సురేష్, లాడేగమ గంగాధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.