అక్షరటుడే, కామారెడ్డి: Vishwa Bharathi School | నిత్యం పాఠశాలల్లో పుస్తకాలతో గడిపే విద్యార్థులు పొలంబాట పట్టారు.. తమ చిట్టి చేతులతో నాట్లు వేశారు..విద్యార్థులకు చదువుతో పాటు బయట ప్రపంచాన్ని పరిచయం చేసేలా ఈ మధ్య పాఠశాలల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి.
Vishwa Bharathi School | విశ్వభారతి పాఠశాల విద్యార్థులు..
పట్టణంలోని విశ్వభారతి పాఠశాలకు చెందిన విద్యార్థులకు పాఠశాల యాజమాన్యం మంగళవారం పట్టణ శివారులోని రామేశ్వర్ పల్లి (Rameshwar Pally) గ్రామంలో వ్యవసాయంపై (Agriculture) అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులు వ్యవసాయ భూమిలో పొలం నాట్లు వేశారు. పాఠశాల కరస్పాండెంట్ అబ్దుల్ సలాం (School Correspondent Abdul Salam) విద్యార్థులకు వ్యవసాయ పనులను వివరించారు. మనం తింటున్న ఆహారం ఎలా తయారవుతుందో.. దానికి రైతులు ఎంత కష్టపడాల్సి వస్తుందో విద్యార్థులకు కూలంకషంగా వివరించారు.
పంట వేసిన నాటి నుంచి కోత వరకు అయ్యే పెట్టుబడి, ఖర్చులు, రైతుకు వచ్చే ఆదాయాన్ని విద్యార్థులకు వివరించారు. అనంతరం వ్యవసాయ పొలం వద్దనే సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులకు చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తే భవిష్యత్లో విద్యార్థులు అనేక విషయాలపై అవగాహన పెంచుకునే అవకాశం ఉంటుందని పాఠశాల కరస్పాండెంట్ సలాం వివరించారు.