అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uttar Pradesh | ఉత్తర్ప్రదేశ్లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. బరేలీలోని భూటా పోలీస్ స్టేషన్ (Bhuta Police Station) ప్రాంతంలో స్నేహితుడే కీచకుడిగా మారాడు. గ్రామంలోని ప్రభుత్వ కుళాయి వద్ద 18 ఏళ్ల అమ్మాయి బట్టలు ఉతుకుతుండగ. అమిత్ అనే సుపరిచితుడైన యువకుడు ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లాడు.
అక్కడ మత్తు మందు ఇచ్చి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అమ్మాయి చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాకపోయేసరికి, కుటుంబ సభ్యులు (family members) ఆమె కోసం వెతికారు. చివరికి నిందితుడి ఇంట్లో అపస్మారక స్థితిలో కనుగొన్నారు.
జరిగిన విషయం తెలిసి, నిందితుడి కుటుంబ సభ్యులు రాజీ కోసం బాధితులపై ఒత్తిడి చేశారు. అమ్మాయి కుటుంబం నిరాకరించడంతో, చంపేస్తామని బెదిరించారు. అయినా తలొగ్గక పోలీసులకు(Police) ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల (medical tests) నిమిత్తం ఆస్పత్రి(Hospital)కి పంపించారు.