అక్షరటుడే, గాంధారి: Gandhari Mandal | బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి (Balkonda MLA Prashanth Reddy), ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ (Jajala Surender) డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు శనివారం మాట్లాడారు.
Gandhari Mandal | ఆస్పత్రిలో రంజిత్‌ను పరామర్శించిన జాజాల
గాంధారి మండలం ముదెల్లి గ్రామంలో (Mudelli village) గొడ్డలి దాడికి గురై నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మనోరమ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ (BRS party) కార్యకర్త రంజిత్‌ను మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల అరాచకాలు రోజురోజుకు శృతిమించుతున్నాయన్నారు.
Gandhari Mandal | దావత్ అని పిలిచి దాడి చేశారు..
ముదెల్లి గ్రామానికి చెందిన రంజిత్‌ను ఎమ్మెల్యే అనుచరులు దావత్ పేరిట ఫోన్ చేసి పిలిపించి గొడ్డలితో దాడి చేశారని సురేందర్ ఆరోపించారు. డీఎస్పీ, సీఐ మావాళ్లే అనుకుంటూ గ్రామంలో తిరుగుతూ రెండు రోజుల్లో ఏదో ఒకటి చేస్తామని చెప్పి నేడు ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీలో (Congress party) మాత్రమే ఉండాలా.. ఇతర పార్టీలో ఉండకూడదా అని ప్రశ్నించారు. ఇన్ని జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తే సహించేది లేదని, తమ నుంచి కూడా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ దాడి ఒక్కరితో జరగలేదని, దీని వెనక ఉన్న వారిపై 24 గంటల్లో పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. బాధితుడిని పరామర్శించిన వారిలో మాజీ జడ్పీటీసీ తానాజీ రావు, బీఆర్ఎస్ నాయకులు ఆస్పత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు.
Gandhari Mandal | వైద్యుడితో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి..
ముదెల్లి ఘటన గురించి తెలుసుకున్న మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మనోరమ హాస్పిటల్ (Manorama Hospital) వైద్యుడు కట్ట నర్సింహాను ఫోన్‌ను సంప్రదించారు. బాధితుడి యోగక్షేమాలపై ఆరా తీశారు. 48 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉన్నాడని వైద్యుడు తెలిపాడు.