అక్షరటుడే, ఇందూరు: Teachers Training | శిక్షణ తరగతులను ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని.. పాఠశాలల్లో ఉత్తమ బోధన అందించాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఉషారాణి అన్నారు. మంగళవారం నగరంలోని బోర్గాం(పి) పాఠశాలలో రెండోవిడత శిక్షణ తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం డీఈవో అశోక్ (DEO Ashok) మాట్లాడుతూ అకడమిక్ అంశాల లెర్నింగ్ ఔట్‌కమ్ సాధించడం, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడం, తదితర అంశాలపై వివరించారు. వారి వెంట సెంటర్ ఇన్‌ఛార్జి శంకర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులు

ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న జేడీ ఉషారాణి, డీఈవో అశోక్
