Homeజిల్లాలునిజామాబాద్​Giriraj College | గిరిరాజ్​ కళాశాలలో ఏకో బజార్​ను సద్వినియోగం చేసుకోవాలి

Giriraj College | గిరిరాజ్​ కళాశాలలో ఏకో బజార్​ను సద్వినియోగం చేసుకోవాలి

గిరిరాజ్​ కళాశాలలో ఏర్పాటుచేసిన క్యాంపస్ ఏకో బజార్​ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. కళాశాలలో ఏకో బజార్​ను గురువారం ఆయన ప్రారంభించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Giriraj College | Giriraj College | గిరిరాజ్​ కళాశాలలో ఏర్పాటుచేసిన క్యాంపస్ ఏకో బజార్​ను (Eco Bazaar) విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి సూచించారు. ఏకో క్లబ్, తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ (Telangana National Green Corps) సంగీత ఆధ్వర్యంలో కళాశాలలో ఏకో బజార్ స్వదేశీ దీపావళి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు స్వయంగా తయారుచేసే కొత్త రుచులను పరిచయం చేశారని పేర్కొన్నారు. ప్లాస్టిక్ రహిత పర్యావరణానికి అనుకూలమైన వస్తువులను ప్రచారం చేస్తున్నారన్నారు. తక్కువ ధరలకు విక్రయించేందుకు స్టాల్స్ ఏర్పాటు చేశారని చెప్పారు.
ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు వస్తువుల అమ్మకం, మార్కెటింగ్, ప్రణాళిక, నాయకత్వ లక్షణాలు, నైపుణ్యాలు, స్టాళ్ల ఏర్పాటు, సుందరీకరణ, పర్యావరణ, స్నేహపూర్వక ఉత్పత్తులు, సేవలను ప్రచారం చేయడానికి ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఏకో క్లబ్ సమన్వయకర్త నరేష్ కుమార్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రంగరత్నం, అకాడమిక్ కో–ఆర్డినేటర్ నహీదా బేగం, రాజేష్, దండు స్వామి, తదితరులు పాల్గొన్నారు.