అక్షరటుడే, బాన్సువాడ:Summer Camp | క్రీడాకారులు వేసవి శిక్షణ శిబిరాన్ని(Summer Training Camp) సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌ఛార్జి ఎంఈవో వెంకన్న(MEO Venkanna) పేర్కొన్నారు. బీర్కూర్ ఉన్నత పాఠశాలలో సమ్మర్ క్యాంప్(Summer Camp)ను ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ క్యాంప్‌లో అథ్లెటిక్స్, వాలీబాల్, చెస్, డిస్కస్ త్రో, తదితర క్రీడా పోటీలతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణ ఉంటుందని తెలిపారు.
15 రోజుల పాటు ఈ శిక్షణ శిబిరం కొనసాగుతుందని, ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జి హెచ్ఎం రాధాకృష్ణ, పీడీ ప్రసాద్, మాజీ ఎంపీపీ రఘు, మేకల విఠల్ తదితరులు పాల్గొన్నారు.