అక్షరటుడే, హైదరాబాద్: TAJGVK | ఆగస్టు 08, 2025 – TAJGVK హోటల్స్ & రిసార్ట్స్ లిమిటెడ్ (TAJGVK Hotels & Resorts Limited) జూన్ 30, 2025తో ముగిసిన మొదటి త్రైమాసికంలో తన అత్యుత్తమ పనితీరును ప్రకటించింది. ఈ త్రైమాసికంలో నిర్వహణ ఆదాయం 15% పెరిగి రూ. 106.39 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా TAJGVK హోటల్స్ & రిసార్ట్స్ ఛైర్మన్ డా. జివికె రెడ్డి మాట్లాడుతూ, “నిరంతర డిమాండ్ మా మార్కెట్లలో బలమైన వృద్ధిని చూపుతోంది.
త్రైమాసికంలో ఇతర ఆదాయంలో జాయింట్ వెంచర్ కంపెనీ గ్రీన్ వుడ్స్ ప్యాలెస్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ. 20.21 కోట్లు డివిడెండ్ ద్వారా వచ్చాయి” అని తెలిపారు. గ్రీన్ వుడ్స్ ప్యాలెస్ & రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ముంబైలోని (Mumbai) తాజ్ శాంటాక్రూజ్‌ను నిర్వహిస్తోంది. ఈ కంపెనీ Q1 FY 2026లో రూ. 54.45 కోట్ల ఆదాయాన్ని, రూ. 20.62 కోట్ల EBITDAను సాధించింది. బ్రాండ్ ఫైనాన్స్-UK ప్రకారం, TAJGVK నిర్వహణలో ఉన్న ఐదు తాజ్ హోటళ్లు ‘ఇండియాస్ స్ట్రాంగెస్ట్ బ్రాండ్ 2025’ (India Strongest Brand 2025) మరియు ‘వరల్డ్స్ స్ట్రాంగెస్ట్ హోటల్ బ్రాండ్ 2025’గా (World’s Strongest Hotel Brand 2025) గుర్తింపు పొందాయి. రాబోయే త్రైమాసికాల్లో కూడా ఈ సానుకూల ధోరణి కొనసాగుతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.