Nizamabad
Nizamabad | తైక్వాండో అసోసియేషన్​ జిల్లా కార్యవర్గం ఎన్నిక

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamabad | తైక్వాండో అసోసియేషన్ (Taekwondo Association) జిల్లా కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నిక నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా ఛైర్మన్​గా డాక్టర్ రమేష్ పవర్, అధ్యక్షుడిగా మహమ్మద్ అజ్మత్ ఖాన్, ప్రధాన కార్యదర్శిగా వినోద్ నాయక్, కోశాధికారిగా వినోద్, ఉపాధ్యక్షులుగా వాగ్మారే సుభాష్, శ్యామ్, మంజునాథ్, వినోద్ రెడ్డి, రాము, సంయుక్త కార్యదర్శులుగా ప్రశాంత్ కుమార్, బుచ్చన్న, మురళి, వినోద్, ప్రవీణ్, సంతోష్ ఎన్నికయ్యారు.

అసోసియేషన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాహజ్​ అలీ మాట్లాడుతూ.. తమ సంఘానికి మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ నుంచి గుర్తింపు వచ్చిందన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి తైక్వాండోలో ఎంతో మంది క్రీడాకారులు రాణిస్తున్నారని పేర్కొన్నారు. భవిష్యత్​లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దాలని సూచించారు. ఎన్నికల అధికారిగా ఫుట్​బాల్​ కోచ్​ జి నాగరాజు వ్యవహరించారు. నెట్​బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జయపాల్ తదితరులు పాల్గొన్నారు.