HomeUncategorizedAkkineni akhil marriage | అఖిల్ పెళ్లిలో మెరిసిన టబు.. నాగ్​ మాజీ గార్ల్ ఫ్రెండ్...

Akkineni akhil marriage | అఖిల్ పెళ్లిలో మెరిసిన టబు.. నాగ్​ మాజీ గార్ల్ ఫ్రెండ్ కూడా వ‌చ్చిందా అంటూ కామెంట్స్

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Akkineni akhil marriage : అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ వివాహం జూన్ 6న జూబ్లిహిల్స్‌(Jubilee Hills)లోని నాగ్ ఇంట్లో ప్రైవేట్ పార్టీగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి కొద్ది మంది ప్ర‌ముఖులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు.

అయితే జూన్ 8న అన్న‌పూర్ణ స్టూడియోలో (Annapurna Studios) రిసెప్ష‌న్ వేడుక నిర్వ‌హించ‌గా, ఈ కార్య‌క్ర‌మానికి సినీ ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన అతిర‌థ మ‌హ‌ర‌థులు హాజ‌ర‌య్యారు. అయితే అంద‌రిలో ట‌బు స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచింది. అఖిల్ పెళ్లి కోసం ట‌బు ప్ర‌త్యేకంగా రావ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. కింగ్ నాగార్జున్‌(King Nagarjuna)-టబు(Tabu) రిలేషన్‌లో ఉన్నారంటూ ఏళ్లుగా గాసిప్స్ నడుస్తూనే ఉన్నాయి. నిన్నేపెళ్లాడతా మూవీ(movie Ninne Pelladatha)లో తొలిసారిగా నటించిన సమయంలోనే వీరిద్దరి కెమిస్ట్రీకి వంద మార్కులు పడ్డాయి.

Akkineni akhil marriage : అంద‌రి దృష్టి ఆమె పైనే..

ఆ మూవీలో వారి ఆన్‌స్క్రీన్ రొమాన్స్‌కి ఆడియెన్స్‌ బాగా కనెక్ట్ అవ్వడంతో జంట బాగుందంటూ ప్రశంసలే కాదు పుకార్లు వచ్చాయి. తమపై వచ్చే గాసిప్స్‌కు మొదట్లో వీరిద్దరూ ఇబ్బందిపడినా, తర్వాత పట్టించుకోవడం మానేశారు. ఇన్నేళ్లు గడుస్తున్నా నాగార్జున – టబుల Tabu ఇష్యూపై సందర్భం వచ్చినప్పుడల్లా చర్చ నడుస్తూనే ఉంటుంది. ఇటీవ‌ల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టబుతో ప్రేమాయణంపై క్లారిటీ ఇచ్చారు కింగ్. టబు హైదరాబాద్ వస్తే మా ఇంట్లోనే ఉంటుందని, మా ఇంటికి ముందున్న ఫ్లాట్ టబుకి తన భార్య అమల దగ్గరుండి కట్టించిందని నాగ్ చెప్పారు. సినిమాల్లోకి రాకముందు కంటే.. టబుకి 16 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆమెతో తనకు ఫ్రెండ్‌షిప్ ఉందని ఆయన తెలిపారు.

టబు హైదరాబాదీ(Hyderabad) కావడం.. ఇక్కడే పుట్టి పెరగడంతో నాకు ఎక్కువగా స్నేహం ఉండేది. నేను కూడా హైదరాబాద్ లో పెరగడంతో.. మా మధ్య మంచి స్నేహం ఉండేది అన్నారు నాగార్జున. ఇక టబు బాలీవుడ్ కు వెళ్లిపోవడం. అక్కడ నుంచి పనిమీద ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా.. నా ఇంట్లోనే ఉంటుంది. ఆమెకు కావల్సినవన్నీ అమల దగ్గరుండి చూసుకుంటుంది. నాన్నగారు ఉన్నప్పుడు కూడా టబు అందరితో కలిసి భోజనం చేసేది. అందరితో హ్యాపీగా మాట్లాడి.. తన పని అయిపోయేంత వరకూ మాతోనే ఉండేది. ఆ తరువాత తిరిగి వెళ్లిపోయేది అన్నారు నాగ్. అంత క్లారిటీ ఇచ్చినా కూడా రూమ‌ర్స్‌కి చెక్ ప‌డ‌డం లేదు.