అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు ఈనెల 22న జిల్లాలో ప్రయోగాత్మకంగా ‘టేబుల్ టాప్ ఎక్సర్సైజ్’ను (Table Top Exercise) నిర్వహించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఎండీఎంఏ మేజర్ సుధీర్, ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ హాసన్ నైన్, తెలంగాణ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ నారాయణరావు, రెవెన్యూ శాఖ కార్యదర్శి లోకేష్‌లు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు.
Collector Nizamabad | భారీ వర్షాల కారణంగా..
మాక్ ఎక్సర్సైజ్ చేపట్టాల్సిన ఆవశ్యకత గురించి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మాట్లాడారు. ఇటీవల ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర నుంచి జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు (Sriramsagar project) పెద్దఎత్తున వరద ప్రవాహం వచ్చిందన్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల స్థితిగతుల ముందస్తుగానే సమాచారం సేకరిస్తూ దిగువకు మిగులు జలాలు విడుదల చేశామన్నారు. అయితే ఆరు గ్రామాలు వరద తాకిడికి ముంపునకు గురయ్యాయన్నారు. అయినప్పటికీ తక్షణ సహాయక చర్యలు చేపట్టి ఆస్తిప్రాణ నష్టాన్ని నివారించగలిగామని వెల్లడించారు.
Collector Nizamabad | విపత్తు సమయంలో..
అకస్మాత్తుగా సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు అధికారులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. పలు పరిశ్రమల్లో ప్రమాదాలు అకస్మాత్తుగా జరిగి ప్రాణనష్టం జరుగుతుందన్నారు. అలాంటి సమయంలో అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తినష్టాలను తగ్గించేందుకు సంబంధిత అధికారులు చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.
Collector Nizamabad | కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు..
వీటిలో దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం విపత్తు నిర్వహణ విషయంలో అప్రమత్తతను పెంపొందించేందుకు మాక్ ఎక్స్‌ర్‌సైజ్ (mock exercise) నిర్వహించాలని ఆదేశించిందన్నారు. ఇది ప్రయోగాత్మక కార్యక్రమం అయినప్పటికీ పక్కాగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ (Additional Collector Kiran Kumar), అదనపు డీసీపీ బస్వారెడ్డి, అగ్నిమాపక శాఖ అధికారి పరమేశ్వర్, జ్పడీ సీఈవో సాయ గౌడ్, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, కలెక్టరేట్ విపత్తుల నిర్వహణ విభాగం పర్యవేక్షకుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.