అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Taapsee Pannu | సినిమా ఇండస్ట్రీలో వెలుగులు, మెరుపులు కనిపించినా… ఆ వెలుగుల వెనుక అనేక అవమానాలు, కష్టాలు దాగి ఉంటాయి. నేడు గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఓ స్టార్ హీరోయిన్ (Star Heroine) కూడా కెరీర్ ప్రారంభంలో తీవ్ర బాడీ షేమింగ్‌ను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది.
ఒకప్పుడు టాలీవుడ్ (Tollywood)లో వరుసగా కమర్షియల్ సినిమాల్లో నటించిన ఆమె, ప్రస్తుతం బాలీవుడ్లో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ఆమె మరెవరో కాదు… పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ పన్ను. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాప్సీ తన కెరీర్ తొలి రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తు చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే ఒక మూస పద్ధతిలో ఉండాలనే భావన బలంగా ఉందని ఆమె వ్యాఖ్యానించింది.
Taapsee Pannu | ఓపెన్ కామెంట్స్..
ముఖ్యంగా తన సహజమైన ఉంగరాల జుట్టుపై దర్శకులు, నిర్మాతలు చేసిన వ్యాఖ్యలు తనను మానసికంగా చాలా బాధించాయని చెప్పింది. నాకు సహజంగానే ఉంగరాల జుట్టు ఉంటుంది. కానీ షూటింగ్ సెట్లో దర్శకులు, ప్రొడ్యూసర్లు దీనిని అస్సలు ఇష్టపడేవారు కాదు. నా జుట్టు సరిగా లేదని, అది గజిబిజిగా కనిపిస్తుందని మొహం మీదే చెప్పేవారు. అప్పట్లో ఆ మాటలు నాకు చాలా షాక్ ఇచ్చాయి” అంటూ తన అనుభవాన్ని తాప్సీ వెల్లడించింది. జుట్టుతోనే కాకుండా తన శరీర ఆకృతి విషయంలో కూడా వివక్ష ఎదురైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్లు అంటే ఒకే రకమైన బాడీ షేప్ (Body Shape) ఉండాలనే అభిప్రాయం ఇండస్ట్రీలో ఉందని, లేకపోతే అవకాశాలు రావడం కష్టమని పరోక్షంగా చెప్పేవారని తెలిపింది. గ్లామర్ పాత్రలకే పరిమితం చేసి, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇవ్వడంలో వెనకడుగు వేయడం తనను బాధించిందని పేర్కొంది.
ఆ సమయంలో నాలో ఏదో లోపం ఉందేమో అనే భయం కలిగేది. చాలా ఆత్మరక్షణలోకి వెళ్లిపోయాను. కానీ కాలక్రమేణా నా సహజత్వాన్ని నేను ప్రేమించడం నేర్చుకున్నాను. నా ఉంగరాల జుట్టును స్ట్రెయిట్ చేయించుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయించుకున్నాను” అని తాప్సీ ధైర్యంగా చెప్పింది. ప్రస్తుతం తాప్సీ పన్ను కేవలం నటిగానే కాకుండా ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ (Powerful Personality)గా ఎదిగింది. ఒకప్పుడు ఆమెను అవమానించిన వారే ఇప్పుడు ఆమె డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. బాడీ షేమింగ్ ఒక వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని ఎంతగా దెబ్బతీస్తుందో తాప్సీ మాటలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.