అక్షరటుడే, వెబ్‌డెస్క్: T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆసక్తికరమైన అంశం చోటుచేసుకుంది. లీగ్ దశలో మెగా టోర్నీ నుంచి వెనక్కి మళ్లే పరిస్థితికి చేరిన ఆస్ట్రేలియా.. గ్రూప్ సీ మ్యాచ్‌లో భాగంగా శుక్రవారం (ఫిబ్రవరి 20) ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో ఒమన్‌పై కంగారు జట్టు రెచ్చిపోయింది. బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ విధ్వంసం సృష్టించింది.
T20 World Cup 2026 | పేళవమైన బ్యాటింగ్
మొదట బ్యాటింగ్ చేపట్టిన ఒమన్ ఆసీస్ బౌలర్ల ధాటిరి 16.2 ఓవర్లలో 104 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. వసీం అలీ (32), జతీంధర్ సింగ్ (17), కరణ్ సోనావాలే (12), హమ్మద్ మీర్జా (16) మాత్రమే కాస్త ఆడారు. మిగతా వారి ఆట పేళవంగా మారింది.
ఆసీస్ స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లు తీసుకున్నాడు. బార్ట్ట్, మ్యాక్స్‌వెల్ చెరో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఎల్లిస్, స్టోయినిస్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
105 పరుగుల లక్ష్యంతో బరిలోకి ఆసీస్ కేవలం 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ (66) చెలరేగాడు. ట్రావిస్ హెడ్ (19 బంతుల్లో 32) దడదడలాడించారు. హెడ్ ఔటైన ఇంగ్లీస్ (12)తో కలిసి కెప్టెన్ మార్చ్ జట్టును విజయానికి చేరువ చేశాడు.