Symptoms | శరీరం ఇచ్చే ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తున్నారా.. అయితే మీ ప్రాణాలను రిస్క్‌లో పడేస్తున్నట్లే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Symptoms | సాధారణంగా మన శరీరంలో ఏదైనా చిన్న మార్పు తలెత్తినప్పుడు అదే తగ్గిపోతుందిలే అని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, శరీరంలో వచ్చే ప్రతి మార్పు వెనుక ఒక కారణం ఉంటుందని, దానిని పట్టించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ అనారోగ్యమైనా మొదటి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అందుకే, మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడని కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Symptoms | […]

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Symptoms | సాధారణంగా మన శరీరంలో ఏదైనా చిన్న మార్పు తలెత్తినప్పుడు అదే తగ్గిపోతుందిలే అని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, శరీరంలో వచ్చే ప్రతి మార్పు వెనుక ఒక కారణం ఉంటుందని, దానిని పట్టించుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం కావచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏ అనారోగ్యమైనా మొదటి దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అందుకే, మనం అస్సలు నిర్లక్ష్యం చేయకూడని కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Symptoms | బరువు తగ్గడం

వ్యాయామం, డైటింగ్ చేయకుండానే హఠాత్తుగా బరువు తగ్గిపోతున్నారంటే అది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఇది థైరాయిడ్ సమస్యలు, మధుమేహం, జీర్ణకోశ వ్యాధులకు సంకేతం కావచ్చు. అలాగే, మలమూత్రాల్లో రక్తం పడటం అనేది కేవలం శరీర వేడి వల్ల జరుగుతుందని అనుకోవడం తప్పు. దీని వెనుక ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన అంతర్గత సమస్యలు ఉండవచ్చు.

స్త్రీల విషయంలో నెలసరి సమస్యలు, వెజైనల్ డిశ్చార్జ్‌ను అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. నెలసరి సమయంలో రక్తం blood గడ్డల్లా పడటం అనేది ఫైబ్రాయిడ్ల వల్ల జరగవచ్చు, ఇది రక్తహీనతకు దారితీస్తుంది. అలాగే దుర్వాసనతో కూడిన డిశ్చార్జ్, కలయిక సమయంలో నొప్పి రావడం వంటివి ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల లక్షణాలు కావచ్చు. వీటిపై వెంటనే డాక్టరును సంప్రదించాలి.

జుట్టు విపరీతంగా రాలడం అనేది కేవలం సౌందర్య సమస్య మాత్రమే కాదు. ఇది రక్తహీనత లేదా హార్మోన్ల అసమతుల్యతకు చిహ్నం. అలాగే తరచూ కడుపుబ్బరం, వికారం వంటివి వేధిస్తున్నాయంటే అది కేవలం ఆహారం వల్ల కలిగే సమస్యే కాకపోవచ్చు, కిడ్నీలో రాళ్లు లేదా తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా ఇలా జరగవచ్చు.

గుర్తుంచుకోండి, ఆరోగ్యం విషయంలో అనుమానం కలిగితే ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడమే ఉత్తమం. మన శరీరం ఇచ్చే చిన్న చిన్న సంకేతాలను అర్థం చేసుకుంటేనే మనం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండగలం.

Related articles

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డికి మరో అరుదైన గౌరవం.. హార్వర్డ్​లో ప్రసంగించే అవకాశం!

అక్షరటుడే, హైదరాబాద్​: CM Revanth Reddy | తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Telangana Chief Minister Revanth Reddy కి అంతర్జాతీయ...

The Wedding of VIROSH : పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించిన విజయ్-రష్మిక.. ఎప్పుడంటే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: The Wedding of VIROSH | టాలివుడ్​ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక ఎట్టకేలకు తమ వివాహ బంధం వేడుకను ప్రకటించారు....

Flag march | బాన్సువాడలో ఫ్లాగ్​ మార్చ్​.. 19 మంది నిందితుల అరెస్టు

అక్షరటుడే, బాన్సువాడ: Flag march | కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటన నేపథ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులను జిల్లా పోలీస్...

Hydraa Commissioner Ranganath | రూ.70 వేల కోట్లకు పైగా విలువైన 1,350 ఎకరాల స్థలాలను రక్షించాం : హైడ్రా కమిషనర్​ రంగనాథ్​

అక్షరటుడే, హైదరాబాద్​: Hydraa Commissioner Ranganath | గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటివరకు దాదాపు 1,350 ఎకరాల స్థలాలను కబ్జాదారుల కోరల నుంచి కాపాడినట్లు హైడ్రా కమిషనర్...