అక్షరటుడే, బోధన్: Intermediate Education | జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో నవంబర్లోనే సిలబస్ పూర్తిచేసి ప్రాక్టికల్స్ నిర్వహించాలని డీఐఈవో రవికుమార్ (DIEO Ravi Kumar) పేర్కొన్నారు. బోధన్ పట్టణంలోని పలు కళాశాలలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (Government Junior College), షిరిడీ సాయి జూనియర్ కళాశాల, మహిళా కళాశాల, మహాత్మ జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలను తనిఖీ చేశారు. కళాశాలలో తరగతుల నిర్వహణ అధ్యాపకుల, సిబ్బంది పనితీరును పర్యవేక్షించారు. తరగతి గదులను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. అధ్యాపకులు బోధిస్తున్న పాఠాలను శ్రద్ధగా విని ప్రయోజకులుగా మారాలని విద్యార్థులకు (students) సూచించారు.
కళాశాలల్లో ప్రిన్సిపాళ్లు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. అటెండెన్స్ ఫేషియల్ రికగ్నిషన్ సిస్టం (facial recognition system) ద్వారానే నిర్వహణ చేయాలన్నారు. విద్యార్థులకు నవంబర్ నెలలోనే సిలబస్ పూర్తిచేసి ప్రయోగ తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు గమనిస్తూ కళాశాలకు హాజరుకాని విద్యార్థులను రప్పించేందుకు ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు కృషి చేయాలని ఆదేశించారు. రానున్న వార్షిక పరీక్షలకు మంచి ఫలితాలను సాధించేందుకు గాను ప్రత్యేక తరగతులను నిర్వహించాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శద్ధ వహించాలని చెప్పారు.
