అక్షరటుడే, గాంధారి: Gandhari | మండల కేంద్రంలో శనివారం సయ్యద్ చుమన్ షావలి దర్గా (Syed Chuman Shawali Dargah) ఉత్సవాలను శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా పాత మసీద్ నుంచి దర్గా వరకు ముస్లింలు గుర్రంపై సందల్ను ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మాజీ కో–ఆప్షన్ సభ్యుడు ముస్తఫా మాట్లాడుతూ ప్రతిఏటా ఉర్సును (Ursu) భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని వివరించారు. అంతేకాకుండా దర్గా పరిసర ప్రాంతాలను శుభ్రపర్చి రంగులు వేసి విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించామని తెలిపారు.
గుర్రంతో పాత మసీదు నుంచి బయలుదేరి దర్గాకు చేరుకునే తరుణంలో ప్రధాన వీధుల గుండా గుర్రంతో ఆటలాడిస్తూ దర్గాకు చేరుకుంటామన్నారు. అనంతరం సాయంత్రం దర్గా వద్దే భోజన కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి అధిక సంఖ్యలో గ్రామస్థులు, పెద్దలు రాజకీయ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
