అక్షర టుడే, ఆర్మూర్ : Armoor Town | పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో (MLA camp office) సోమవారం స్వదేశీ జాగరణ మంచ్ కరపత్రాలు ఆవిష్కరించారు. నాగ లింగేశ్వర ఆలయంలో (Naga Lingeshwara Temple) బీజేపీ జిల్లా నాయకులు కలిగోట గంగాధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రిటైర్డ్ టీచర్లు రెడ్డి ప్రకాష్ , గుర్రం వెంకటరమణ హాజరై కరపత్రాలు ఆవిష్కరించారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు స్వదేశీ వస్తువులను వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. మనం తయారు చేసిన వస్తువులు మనం వాడుకుంటే ప్రధాని మోదీ (PM Modi) లక్ష్యం వికసిత్ భారత్ సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కలిగోట ప్రశాంత్, పిట్ల శ్రీధర్, తోట నారాయణ, ప్రముఖ వ్యాపారస్థులు సత్య శ్రీనివాస్, గజవాడ రాజయ్య, పడిగేల్ శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.