అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని గాయత్రి నగర్ అంగన్వాడీ కేంద్రంలో బుధవారం స్వచ్ఛభారత్ కార్యక్రమం (Swachh Bharat program) నిర్వహించారు. రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ నిజామాబాద్ ఏరియా ఆఫీస్ (Nizamabad Area Office) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పిల్లలకు పరిసరాల, వ్యక్తిగత పరిశుభ్రత, తదితర అంశాలపై అవగాహన కల్పించారు.
అలాగే ఆర్సీఎఫ్ ఆఫీస్ సిబ్బంది పరిసరాలను శుభ్రం చేశారు. కార్యక్రమంలో ఆర్సీఎఫ్ లిమిటెడ్ ఏరియా ఇన్ఛార్జి సందీప్ కేశార్కర్, కంపెనీ మార్కెటింగ్ ఆఫీసర్ సునీల్ కుమార్, సుమంత్ కుమార్, ఎస్ అశోక్ కుమార్, జి చంద్రశేఖర్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్ సరిత పాల్గొన్నారు.