Homeజిల్లాలునిజామాబాద్​Armoor | సెయింట్ పాల్ హైస్కూల్​లో స్వచ్ఛభారత్..

Armoor | సెయింట్ పాల్ హైస్కూల్​లో స్వచ్ఛభారత్..

విద్యార్థులు స్వచ్ఛ భారత్​ కార్యక్రమాల్లో పాల్గొనాలని మహాత్మ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణంలోని సెయింట్​ పాల్​ స్కూల్​లో పిచ్చిమొక్కలు తొలగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Armoor | పట్టణంలోని మామిడిపల్లిలో (Mamidipalli) సెయింట్ పాల్ హైస్కూల్​లో ఆర్మూర్ మహాత్మ స్వచ్ఛంద సంస్థ (Mahatma NGO) ఆధ్వర్యంలో ఆదివారం స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ఆవరణలో పెరిగిన పిచ్చిమొక్కలు, చెట్లను తొలగించారు.

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకె శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘ప్రతి ఆదివారం ఒక గంట..’ నినాదంతో చేస్తున్న ఈ స్వచ్ఛ కార్యక్రమం విజయవంతంగా 28 వారాలు పూర్తి చేసుకుందన్నారు.

Armoor | స్వచ్ఛ కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలి

ఈ సందర్భంగా విద్యార్థులకు స్వచ్ఛ కార్యక్రమంపై (Swachh Bharat program) అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ వంతుగా స్వచ్ఛ కార్యక్రమలో పాల్గొనాలన్నారు. అనంతరం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులను పాఠశాల సిబ్బంది శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కేథరిన్ పాల్, కరస్పాండెంట్ ఇనాక్పాల్, వైస్ ప్రిన్సిపాల్ సిసిల్యా ఏంజిల్, సంస్థ సభ్యులు సుంకె, నిశాంత్, బొగడమీది ప్రశాంత్, వేద రాజ్ కుమార్ నరేందర్, గుర్రం రాకేష్, వంట నరేష్, కృషివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News