అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Nizamabad City | నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని (Varni) మండలం సిద్ధాపూర్ (Siddapur) గ్రామానికి చెందిన యువకుడు కెతావత్ భాస్కర్(19)కు వెన్నునెప్పితో బాధపడుతున్నాడు. దీంతో శనివారం ఉదయం ఒకటో టౌన్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో (Private Hospital) స్పైన్ సర్జరీ నిమిత్తం చేరాడు.
ఆపరేషన్‌కు సిద్ధమైన వైద్యుడు యువకుడికి సర్జరీ చేసే క్రమంలో అనస్థీషియా(Anesthesia) ఇచ్చారు. అనంతరం సదరు యువకుడి మృతి చెందాడు. కాగా.. అనస్థీషియా డోస్ ఎక్కువ కాడంతో యువకుడు మృతి చెందాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. సీపీఆర్ (CPR) చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదని.. వైద్యుల నిర్లక్ష్యంతోనే యువకుడు మృతి చెందాడని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధితులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. మృతుడు కెతావత్ భాస్కర్‌కు ఇటీవలే ఐఐటీ మద్రాస్‌లో సీటు కూడా వచ్చింది. అంతలోనే ఈ ఘోరం జరిగిందని బాధితులు రోధించారు.