అక్షరటుడే, ఇందూరు : Medical College | నిజామాబాద్ మెడికల్ కళాశాల (Nizamabad Medical College)లో జూనియర్‌ను ర్యాగింగ్ (Raging) చేసిన విద్యార్థులు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ఇంటెన్స్‌ను ఆరు నెలలపాటు సస్పెన్షన్ చేయడంతో పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ర్యాగింగ్ ఘటనపై ప్రిన్సిపల్ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ (Anti Raging) కమిటీ సోమవారం ఉదయం సమావేశమైన విషయం తెలిసిందే. ఘటనపై ఇరువర్గాల వాదనలను వినడంతో పాటు జుడా మెంబర్‌తో మాట్లాడిన అనంతరం సస్పెండ్ చేశారు. అంతేకాకుండా తదుపరి చర్యలపై పోలీస్ శాఖ సమర్పించిన నివేదిక మీద చర్యలు తీసుకోనున్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో అడిషనల్ కలెక్టర్, డీసీపీ, జీజీహెచ్ సూపరింటెండెంట్, అడిషనల్ సూపరింటెండ్, వైస్ ప్రిన్సిపల్, అకడమిక్, డ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్, వివిధ శాఖల అధిపతులు హాజరయ్యారు.
Medical College | అసలు ఏం జరిగిందంటే?
పటాన్‌చెరుకు చెందిన రాహుల్ రెడ్డి ప్రస్తుతం మెడికల్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్ అయిన సాయిరాం పవన్ రిజిస్టర్లో నమోదు చేశాడు. దీనిపై ప్రశ్నించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాకుండా శనివారం సాయంత్రం మాట్లాడుదామని పిలిపించి సీనియర్లు దాడి చేశారు. పలువురు విద్యార్థులు రాహుల్‌ను ర్యాగింగ్ చేయడంతో పాటు బెదిరించారు.
Medical College | కేసు నమోదు
బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు నగరంలోని వన్ టౌన్ పోలీసులు (One Town Police) ఆదివారం కేసు నమోదు చేశారు. సాయిరాం పవన్, శ్రావణ్, సాత్విక్ హృదయ పాల్, అభినవ్ పెద్ది, ఆదిత్యతో పాటు పలువురు రాహుల్‌పై దాడి చేశారు. ఈ మేరకు పోలీసులు BNS 292, 115(2), 131 సెక్షన్లతో పాటు తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం సెక్షన్ 4(1), 4(11) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా ర్యాగింగ్‌కు పాల్పడిన ఐదుగురు విద్యార్థులను ప్రిన్సిపాల్ సస్పెండ్ చేశారు.