అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | అనుమానితుల కదలికలపై పోలీసు నిఘా ఉండాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌ను (Machareddy police station) బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ముందుగా స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం స్టేషన్‌లో రికార్డులు, రిసెప్షన్, లాకప్, మెయిన్ బ్యారక్, టెక్నికల్ రూంను పరిశీలించారు.
అలాగే స్టేషన్ పరిధిలో ఎక్కువగా జరిగే నేరాలు, పెండింగ్ కేసులు, దర్యాప్తు వివరాలను ఎస్సై అనిల్‌ను (SI Anil) అడిగి తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ సత్వర న్యాయం చేయాలని సూచించారు. నేరాల అదుపునకు పటిష్టమైన గస్తీ, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. కేసుల నమోదు, రికార్డుల నవీకరణ ఎప్పటికప్పుడు చేసి ఎలాంటి పెండెన్సీ లేకుండా ఉంచాలని సూచించారు. దేవాలయాలు, ప్రార్థన స్థలాలు, బ్యాంకుల్లో సీసీ కెమెరాలు (CCTV cameras) తప్పనిసరిగా ఏర్పాటు చేయించాలన్నారు.
కామారెడ్డి నుంచి సిరిసిల్లకు వెళ్లే స్టేట్ హైవే మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నందున రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, బ్లాక్ స్పాట్స్ గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ప్రజలకు సైబర్ సేఫ్టీపై సూచనలు ఇవ్వాలన్నారు. ఆయన వెంట ఏఎస్పీ చైతన్యరెడ్డి (ASP Chaitanya Reddy), స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఎస్సై అనిల్, సిబ్బంది ఉన్నారు.