HomeUncategorizedNepal PM | నేపాల్ ప్ర‌ధానిగా సుశీల బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌.. నేపాల్ అల్ల‌ర్ల మృతులు అమ‌ర‌వీరులుగా...

Nepal PM | నేపాల్ ప్ర‌ధానిగా సుశీల బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ‌.. నేపాల్ అల్ల‌ర్ల మృతులు అమ‌ర‌వీరులుగా గుర్తింపు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nepal PM | నేపాల్ పున‌రుద్ధ‌ర‌ణకు త‌మ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని ఆ దేశ తాత్కాలిక ప్రధానమంత్రి సుశీలా కార్కి వెల్ల‌డించారు. తాము ప్ర‌జ‌ల‌కు సేవ చేయడానికి బాధ్య‌త‌లు చేప‌ట్టాము త‌ప్పితే అధికారాన్ని అనుభ‌వించేందుకు కాద‌న్నారు.

నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి సుశీలా కార్కి(Sushila Karki) ఆదివారం సింఘా దర్బార్‌లో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రెండ్రోజుల క్రితం ప్ర‌ధానిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ఆమె తాజాగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేపాల్(Nepal) అభివృద్ధే త‌మ ప్రాధాన్య‌మ‌న్నారు. దేశాన్ని పునర్నిర్మించడానికి, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ప్రతిజ్ఞ చేశారు. “మా ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి బాధ్యత తీసుకుంది, అధికారంలో ఉండటానికి కాదు” అని కార్కి చెప్పారు.

Nepal PM | అధికారాన్ని అనుభ‌వించేందుకు రాలేదు..

తాను, త‌న బృందం అధికారాన్ని అనుభ‌వించేందుకు రాలేద‌ని క‌ర్కి స్ప‌ష్టం చేశారు. ఆర్నెళ్ల కంటే ఎక్కువ కాలం తాము ప‌ద‌విలో ఉండ‌మ‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త పార్ల‌మెంట్(New Parliament) కొలువుదీర‌గానే అధికారాన్ని అప్ప‌గిస్తామ‌న్నారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు లేకుండా తాము విజ‌యం సాధించ‌లేమ‌ని, నేపాల్ పున‌ర్ నిర్మాణానికి ప్ర‌జ‌లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. “నా బృందం. నేను ఇక్కడ అధికారాన్ని రుచి చూడటానికి లేము. మేము 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉండము. మేము కొత్త పార్లమెంటుకు బాధ్యతను అప్పగిస్తాము. మీ మద్దతు లేకుండా మేము విజయం సాధించలేము” అని ప్రధానమంత్రి అన్నారు. నేపాల్‌ను పునర్నిర్మించడానికి అంద‌రూ కలిసి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, ఏ అవ‌కాశాన్ని తాము వదులుకోమని చెప్పారు. మన దేశాన్ని పునరుద్ధరించడానికి మేము కృషి చేస్తామని పున‌రుద్ఘాటించారు.జనరల్ జెడ్ ఉద్యమంలో మరణించిన వారిని అధికారికంగా అమరవీరులుగా గుర్తిస్తామని ప్ర‌ధాని వెల్ల‌డించారు. వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.

Must Read
Related News