ePaper
More
    Homeక్రీడలుSuryakumar yadav | ఆస్పతి బెడ్‌పై సూర్య కుమార్ యాద‌వ్.. ఏమైందంటూ టెన్ష‌న్‌లో ఫ్యాన్స్

    Suryakumar yadav | ఆస్పతి బెడ్‌పై సూర్య కుమార్ యాద‌వ్.. ఏమైందంటూ టెన్ష‌న్‌లో ఫ్యాన్స్

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Suryakumar yadav | టీమిండియా టీ20 కెప్టెన్ (Team India T20 captain) సూర్య కుమార్ యాద‌వ్ (Surya kumar yadav) గ్రౌండ్‌లో ఎంత చెల‌రేగి ఆడుతుంటాడో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 360 డిగ్రీస్‌లో షాట్స్ ఆడుతూ ఫ్యాన్స్‌ని అల‌రిస్తుంటాడు. అయితే, ఆయ‌న ఇప్పుడు ఆస్పతి బెడ్‌పై క‌నిపించ‌డం చూసి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. సూర్య కుమార్ యాద‌వ్‌కు ఏం జ‌రిగిందంటూ కంగారు ప‌డుతున్నారు.

    వివరాల్లోకి వెళ్తే.. సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియా స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతున్నాడు. చాలా కాలంగా ఈ స‌మ‌స్యను ఎదుర్కొంటున్న నేప‌థ్యంలో ఆయ‌న శస్త్రచికిత్స చేయించుకున్నాడు. లండన్ (London) వైద్యులు కుడివైపు పొత్తికడుపు కింది భాగంలో సర్జరీ నిర్వహించారు.

    Suryakumar yadav | స‌ర్జ‌రీ స‌క్సెస్..

    సూర్యకుమార్ ఈ విషయాన్ని స్వయంగా తన ఇన్‌స్టా ఖాతా (Instagram)లో షేర్​ చేస్తూ అభిమానులతో పంచుకున్నాడు. స్పోర్ట్స్ హెర్నియా చికిత్స కోసం సర్జరీ చేయించుకున్నాను. ఇది సజావుగా పూర్తయ్యింది.. ప్రస్తుతం కోలుకుంటున్నాను.. మళ్లీ మైదానంలోకి రావాలని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.. అని తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొన్నాడు.

    ఈ అప్‌డేట్‌తో అభిమానుల్లో ఊరట కనిపిస్తుంది. అతను త్వరగా కోలుకుని మళ్లీ జాతీయ జట్టులో తన దూకుడైన ఆటతో అల‌రించాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో సూర్యకుమార్ ఆట తీరుకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉండడమే కాదు, ఫినిషర్‌గా, స్టైల్ బ్యాట్స్‌మన్‌గా కూడా అతని స్థానం ప్రత్యేకమైంది.

    Suryakumar yadav : ఆ మ్యాచ్​కు దూరం!

    శస్త్రచికిత్స కారణంగా సూర్యకుమార్ ఆగస్టులో బంగ్లాదేశ్‌(Bangladesh)తో జరగనున్న టీ20 సిరీస్‌కు దూరంగా ఉండే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్‌కు తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయని విశ్వ‌స‌నీయ‌ వర్గాల సమాచారం.

    ప్రస్తుత ఇండియా – ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఇది ముగిశాక, మెన్ ఇన్ బ్లూ 3 ODIలు, 3 T20 మ్యాచ్‌లు ఆడుతుంది. ప్ర‌స్తుతం శుభ్‌మాన్ గిల్ టెస్ట్ కెప్టెన్‌తో పాటు ప్రస్తుత T20 వైస్-కెప్టెన్, అయితే ఇంగ్లాండ్ పర్యటన తర్వాత విరామం తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితిలో, సూర్యకుమార్ ఫిట్‌గా లేకపోతే, సెలెక్టర్లు కొత్త కెప్టెన్‌ని త‌ప్ప‌క ఎంపిక చేయాల్సి వ‌స్తుంది.

    Latest articles

    Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని ఆన్​లైన్​లో పొందుపర్చాలి: సీపీ

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Cp Sai chaitanya | గణేష్ విగ్రహాల ఏర్పాటు సమాచారాన్ని నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్​లైన్​లో...

    Nizamabad Collector | ప్రజావాణికి 52 ఫిర్యాదులు

    అక్షర టుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా...

    Nizamsagar | నిజాంసాగర్​ ప్రాజెక్ట్​పైకి పర్యాటకులకు నోఎంట్రీ

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ భాగం నుంచి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్​ఫ్లో వస్తోంది....

    Muthoot Fincorp | ముత్తుట్ ఫిన్‌కార్ప్ Q1 ఫలితాలు: లాభాలు తగ్గుముఖం, ఆదాయం, వ్యాపారం వృద్ధి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Muthoot Fincorp | ముత్తుట్ ఫిన్‌కార్ప్ 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (Q1FY26)...

    More like this