Homeక్రీడలుSuryakumar Yadav | పాక్‌పై గెలుపును సైన్యానికి అంకితమిచ్చిన సూర్య.. దోషిగా తేల్చిన రిఫ‌రీ

Suryakumar Yadav | పాక్‌పై గెలుపును సైన్యానికి అంకితమిచ్చిన సూర్య.. దోషిగా తేల్చిన రిఫ‌రీ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Suryakumar Yadav | ఆసియా కప్ 2025లో (Asia Cup) పాకిస్థాన్‌పై టీమిండియా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (captain Suryakumar Yadav) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదానికి దారితీశాయి.

మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ విజయాన్ని ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన భద్రతా సిబ్బందికి మరియు భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వ్యాఖ్యలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కు రెండు వేర్వేరు ఫిర్యాదులు సమర్పించింది. పీసీబీ వాదన ప్రకారం, సూర్యకుమార్ వ్యాఖ్యలు ‘స్పిరిట్ ఆఫ్ క్రికెట్’కు భంగం కలిగించేవిగా ఉన్నాయని పేర్కొంది.

Suryakumar Yadav | ఐసీసీ స్పందన

పీసీబీ (PCB) ఫిర్యాదులపై స్పందించిన ఐసీసీ, ఈ అంశంపై విచారణ చేపట్టేలా మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్‌ను నియమించింది. ప్రాథమికంగా సూర్యకుమార్ వ్యాఖ్యలు క్రీడా విలువలకు విరుద్ధంగా ఉన్నట్లు రిచర్డ్సన్ నివేదించారని ‘దైనిక్ జాగరణ్’ కథనంలో పేర్కొంది. ఈ మేరకు రిచర్డ్సన్ బీసీసీఐకి (BCCI) అధికారికంగా ఈమెయిల్ పంపినట్టు సమాచారం.

ప్రస్తుత పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్ ముందు రెండు ఆప్ష‌న్స్ ఉన్నాయి. తాను చేసిన వ్యాఖ్యలపై తప్పుని అంగీకరిస్తే, మ్యాచ్ రిఫరీ స్వయంగా శిక్షను ఖరారు చేస్తారు. తన వ్యాఖ్యలను సమర్థించుకుంటే, ఐసీసీ ప్రత్యేక విచారణ కమిటీని నియమిస్తుంది. ఈ కమిటీకి రిచర్డ్సన్ ఛైర్మన్‌గా ఉండగా, పీసీబీ ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉండనున్నారు.

ఐసీసీ (ICC) నిబంధనల ప్రకారం.. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించడం ‘లెవెల్ 1’ నేరంగా పరిగణించబడుతుంది. ఇది తేలికపాటి నేరంగా పరిగణించబడుతుందని నిపుణుల అభిప్రాయం. నిషేధం విధించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే, మ్యాచ్ ఫీజులో కోత, లేదా ఒక మ్యాచ్ నిషేదం విధించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.మ‌రోవైపు మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడానికి నిరాకరించారు.. ఈ అంశంపై ఐసీసీ విచారణలో చర్చకు వచ్చే అవకాశముందని అంచనా.

Must Read
Related News