అక్షరటుడే, వెబ్‌డెస్క్:Hero Surya | తమిళ హీరో సూర్య(Tamil hero Surya) గొప్ప మనసు చాటుకున్నాడు. తన సినిమా లాభాల్లో నుంచి రూ.10 కోట్లను పిల్లల చదువుల కోసం విరాళం ఇచ్చాడు.
సూర్య హీరోగా ఇటీవల విడుదలైన రెట్రో మూవీ(Retro movie) తెలుగులో వసూళ్లు రాబట్టలేకపోయింది. కానీ తమిళంలో మాత్రం మంచి సక్సెస్ సాధించింది. రూ.104 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే లాభాలు రావడంతో హీరో కమ్ నిర్మాత అయిన సూర్య సంతోషంతో అగరం ఫౌండేషన్(Agaram Foundation)కు విరాళం అందజేశారు
కాగా హీరో సూర్య(Hero Surya) 2006 అగరం ఫౌండేషన్‌ను స్థాపించాడు. పేద పిల్లలకు విద్య అందించడమే ఈ ఫౌండేషన్ లక్ష్యం. ఈ సంస్థ ద్వారా చదువుకొని ఎంతోమంది ఉన్నత స్థానాలకు చేరారు. తాజాగా రెట్రో మూవీ లాభాల్లో నుంచి రూ.10 కోట్లను సూర్యకు ఫౌండేషన్‌కు దానం చేశారు. ఈ మేరకు విరాళం చెక్కు(Donation Cheque)ను ఫౌండేషన్ నిర్వాహకులకు ఆయన అందించారు. దీంతో హీరో సూర్యను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.