అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | జిల్లాలో గల అసైన్డ్, భూదాన్ ప్రభుత్వ భూముల సర్వేను పక్కాగా జరిపించాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. జిల్లా కలెక్టరేట్ నుంచి సబ్ కలెక్టర్లు, ఆర్డీవో, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ రికార్డుల (Revenue record) ఆధారంగా అసైన్డ్ భూదాన్ భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి సర్వేయర్లతో పక్కాగా సర్వే జరిపించాలన్నారు. విస్తీర్ణం, హద్దులు, సర్వేనెంబర్ తదితర సమగ్ర వివరాలను సేకరించాలని, జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు.
భూభారతి (Bhubharati) దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలని తెలిపారు. సాదా బైనామా దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలిస్తూ.. రెవెన్యూ రికార్డులతో సరిపోల్చుకొని పక్కాగా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ఆర్డీవో రాజేంద్రకుమార్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ అశోక్ పాల్గొన్నారు.
1 comment
[…] విషయంలో కలెక్టర్ Collector సైతం నిక్కచ్చిగా […]
Comments are closed.