120
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | జిల్లా కేంద్రానికి చెందిన సురుకుట్ల ఝాన్సీకి సావిత్రిబాయి పూలే (Savitribai Phule Award) ప్రతిభా పురస్కారం లభించింది. హైదరాబాద్లోని (Hyderabad) రవీంద్రభారతిలో సావిత్రిబాయి పూలే రాష్ట్రస్థాయి ప్రతిభ పురస్కారాలను అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉత్సవ కమిటీ సావిత్రిబాయి పూలే ఫౌండేషన్, బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం సంయుక్తంగా ఉత్తమ మహిళల ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.
Nizamabad City | వ్యాపార రంగంలో రాణిస్తుందున..
ఈ సందర్భంగా ఉత్తమ మహిళ ఎంపికను ఆన్లైన్ ద్వారా నిర్వహించారు. ఇందులో భాగంగా రాష్ట్రస్థాయిలో నిజామాబాద్ జిల్లాకు (Nizamabad district) చెందిన సురుకుట్ల ఝాన్సీకి ఉత్తమ ప్రతిభ పురస్కారం అందజేశారు. వ్యాపారంలో రాణిస్తుందున ఆమెను ఎంపిక చేశారు.