అక్షరటుడే, వెబ్‌డెస్క్: surrogacy case | మేడ్చల్ జిల్లా Medchal district సరోగసి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసి మహిళలతో నిందితురాలు బాండ్లు రాయించుకున్నట్లు తేలింది. తనిఖీల్లో భారీగా ప్రామిసరీ నోట్లు (promissory notes), బాండ్లు బయటపడ్డాయి. అధికారులు పెద్ద ఎత్తున హార్మోన్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఐవీఎఫ్ సెంటర్(IVF center)కు వెళ్లిన దంపతుల వివరాలను.. నిందితురాలు లక్ష్మి ఏజెంట్ల ద్వారా సేకరించేది. లక్ష్మి నివాసంలో హెగ్డే హాస్పిటల్‌తో పాటు పలు ఫెర్టిలిటీ సెంటర్ల (fertility centers) రిపోర్టులు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో ఐవీఎఫ్ సెంటర్లతో లక్ష్మికి ఉన్న సంబంధాలపైనా అధికారులు ఆరా తీశారు..
నిందితురాలితో వాణిజ్య సంబంధాలు కలిగిన పలు హాస్పటల్స్ కు తాజాగా అధికారులు నోటీసులు జారీ చేశారు. పలు ప్రైవేటు ఆస్పత్రులకు నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి ఏజెంట్లుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆయా ఆసుపత్రులకు నోటీసులు జారీ చేశారు. ఆయా యాజమాన్యాలు స్పందించిన తీరుకు అనుగుణంగా పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
surrogacy case | మహిళలను ప్రలోభపెట్టి
నిందితురాలు లక్ష్మి మహిళలను ప్రలోభపెట్టి సరోగసి(surrogacy)కి ఒప్పించేదని పోలీసుల విచారణలో తేలింది. ఒక్కొక్కరితో రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలకు బేరం కుదుర్చుకునేది. అటు సరోగసి కోసం వచ్చిన దంపతుల దగ్గర.. రూ.25 లక్షల వరకు వసూలు చేసేదని పోలీసులు గుర్తించారు.
పిల్లల విక్రయాల కేసు(hild trafficking case)లో.. గతంలో లక్ష్మిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. 8 మంది మహిళలకు ఇప్పటికే పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిందితురాలు లక్ష్మి, కుమారుడు నరేందర్ రిమాండ్‌లో ఉన్నాడు.