81
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yeallareddy | మండల కేంద్రంలోని కస్తుర్బా గాంధీ పాఠశాలను (Kasturba Gandhi School) కామారెడ్డి న్యాయ సేవాధికార సంస్థ(Legal Services Authority) కార్యదర్శి నాగరాణి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు ఆమె పాఠశాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
Yeallareddy | పాఠశాలలో సౌకర్యాలపై అసంతృప్తి..
వంటగదిని, విద్యార్థుల స్నానం గదులను, పడుకునే గదులను తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పోక్సో చట్టం, బాలల హక్కులు, విద్యాహక్కు చట్టంపై అవగాహన కల్పించారు. బాల్యవివాహాల కారణంగా జరిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంంలో ఎల్లారెడ్డి మండల సేవాధికార సంస్థ అధికారిణి సుష్మ తదితరులు పాల్గొన్నారు.