Homeజిల్లాలుకామారెడ్డిGovernment Girls Junior College | ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ

Government Girls Junior College | ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆకస్మిక తనిఖీ

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Government Girls Junior College | బాన్సువాడ (banswada) ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను బుధవారం ఉమ్మడి జిల్లా ఇంటర్మీడియట్ స్పెషల్ ఆఫీసర్ (Intermediate Special Officer) దాసరి ఒడ్డెన్న ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అనంతరం మొదటి సంవత్సరంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు.

హాజరు పట్టిక, సబ్జెక్టు వారీగా ఉత్తీర్ణత శాతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, కళాశాల ప్రిన్సిపాల్ అసద్ ఫారూఖ్, శివకుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.