అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mahavatar Narasimha | తొలి యానిమేటెడ్ పౌరాణిక ఇతిహాస చిత్రం ‘మహావతార్ నరసింహ’ (Mahavatar Narasimha) బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2025లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీలలో ఒకటిగా నిలిచింది.
జూలై 25న విడుదలైన ఈ చిత్రం శనివారంతో 50 రోజులు పూర్తి చేసుకుంది. హాఫ్ సెంచరీ పూర్త నేపథ్యంలో చిత్ర నిర్మాతలు అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు. సినిమాలో తొలగించిన సీన్ ను తాజాగా విడుదల చేశారు. అద్దంలో హిరణ్యకశిపు (Hiranyakashipu) ప్రతిబింబం ఉన్న ఈ సీన్ పై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Mahavatar Narasimha | బంపర్ హిట్..
తొలి యానిమేటెడ్ మూవీగా వచ్చిన మహావతార్ నరసింహ వసూళ్లలో రికార్డులు సృష్టించింది. రూ.15 కోట్లలోపు బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం దాదాపు రూ.400 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 324.61 కోట్లు వసూలు చేసిందని ఇండస్ట్రీ ట్రాకర్ సాక్నిల్క్ తెలిపారు. అశ్విన్ కుమార్ (Ashwin Kumar) దర్శకత్వంలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించగా, హోంబాలే ఫిల్మ్స్ సమర్పిస్తుంది. జయపూర్ణ దాస్, రుద్ర ప్రతాప్ ఘోష్ సహ రచయితగా ఉన్నారు.
Mahavatar Narasimha | డిలిటెడ్ సీన్ విడుదల..
డిలీట్ చేసిన సన్నివేశాల వీడియోను షేర్ చేస్తూ మేకర్స్ ఇలా రాశారు, “హిరణ్యకశిపు ప్రతిబింబం ఇన్నర్ డెమోన్ను విడుదల చేసింది. చూడండి #మహావతార్ నరసింహ తొలగించబడిన దృశ్యం (deleted scene) మీ సమీపంలోని సినిమాల్లో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న పురాణ దృశ్యానికి సాక్షి.” అని రాసుకొచ్చారు. చిత్ర నిర్మాతలు సోషల్ మీడియాలో (Social Media) వేడుక పోస్టర్ను షేర్ చేస్తూ.. “చరిత్రలో నిలిచిపోలేని అద్భుతమైన మైలురాయి! థియేటర్లలో 50 రోజులు #మహావతార్ నరసింహ ఇప్పటికీ 200+ సినిమాహాళ్లలో సందడి చేస్తోంది! మీ అచంచలమైన ప్రేమ ఈ చారిత్రక మైలురాయిని సాధ్యం చేసింది. మేము మాటలకు మించి కృతజ్ఞులం.” అని పోస్టు చేశారు.