HomeతెలంగాణSuravaram Sudhakar Reddy | కమ్యూనిస్టు అగ్రనేత సురవరం కన్నుమూత.. సీఎం సంతాపం

Suravaram Sudhakar Reddy | కమ్యూనిస్టు అగ్రనేత సురవరం కన్నుమూత.. సీఎం సంతాపం

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Suravaram Sudhakar Reddy : రాజకీయాల్లో అజాతశత్రువు, కమ్యూనిస్టు అగ్రనేత, పీడితవర్గాల అభ్యున్నతికి పాటుపడిన తెలంగాణ నాయకుడు.. సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి (84) కన్నుమూశారు.

గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్న సుధాకర్‌ రెడ్డిని కుటుంబసభ్యులు ఇటీవలే గచ్చిబౌలిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్​లో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు.

కాగా.. పరిస్థితి విషమించి శుక్రవారం రాత్రి 10.20 గంటల ప్రాంతంలో సురవరం సుధాకర్‌ రెడ్డి (Suravaram Sudhakar Reddy) కన్నుమూసినట్లు సీపీఐ పార్టీ ప్రకటించింది.

సుధాకర్‌ రెడ్డి భార్య పేరు విజయలక్ష్మి. వీరికి కుమారులు నిఖిల్‌, కపిల్‌ ఉన్నారు. అమెరికా US లో ఉన్న పెద్ద కుమారుడు నిఖిల్‌ ఆదివారం (ఆగస్టు 24) ఉదయానికి భారత్‌ చేరుకుంటారని తెలిసింది.

అప్పటివరకు సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని గచ్చిబౌలి (Gachibowli) కేర్‌ హాస్పిటల్​ మార్చురీలో ఉంచనున్నట్లు సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ వెల్లడించారు.

హిమాయత్‌నగర్‌లోని మగ్దూం భవన్‌ (Magdum Bhavan) లో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పార్టీ కార్యకర్తలు, అభిమానుల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు.

సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని గాంధీ వైద్యకళాశాలకు అప్పగిస్తామని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI National Secretary Narayana) తెలిపారు. కాగా.. నేత్రాలను ఇప్పటికే ఎల్వీ ప్రసాద్‌ కంటి ఆస్పత్రికి ఇచ్చారు.

Suravaram Sudhakar Reddy : సీఎం సంతాపం..

భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలం కలిగిన సురవరం చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తుచేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, దేశ రాజకీయాల్లో ముఖ్యంగా వామపక్ష రాజకీయాల్లో వారు క్రీయాశీలక పాత్ర పోషించారని  గుర్తుచేశారు. ఆయన మరణంతో దేశం ఒక గొప్ప ప్రజాస్వామిక వాదిని కోల్పోయిందని సీఎం పేర్కొన్నారు.

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికైన సురవరం ప్రజా సమస్యల విషయంలో నిరంతరం ముందుండి పోరాటం చేశారని పేర్కొన్నారు. సురవరం సుధాకర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని సీఎం ప్రార్థించారు. సురవరం గారి కుటుంబ సభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతిని CM REVANTH Reddy తెలియజేశారు.