316
అక్షరటుడే, బాన్సువాడ: Volleyball tournament | బాన్సువాడ మండలంలోని కొత్తబాది గ్రామానికి (Kothabadi village) చెందిన కడావత్ సుప్రియ జాతీయస్థాయి సీనియర్స్ వాలీబాల్ పోటీలకు (national-level senior volleyball tournament) ఎంపికైంది. ఈ విషయాన్ని వాలీబాల్ కోచ్ సురేందర్ తెలిపారు.
నవంబర్ 14 నుంచి 16 వరకు మేడ్చల్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ఉమ్మడి జిల్లా జట్టు తరపున పాల్గొన్న సుప్రియ, తన ప్రతిభతో ఆకట్టుకుంది. ఉత్తమ ప్రదర్శన కనబర్చడంతో ఆమెను జాతీయస్థాయి సీనియర్స్ వాలీబాల్ పోటీలకు ఎంపిక చేశారు. ఈ నెల 4 నుంచి 1 వరకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో జరగనున్న జాతీయస్థాయి సీనియర్స్ వాలీబాల్ పోటీలలో సుప్రియ పాల్గొననుంది.