Homeతాజావార్తలుBC Reservations | రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం షాక్​.. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్​ కొట్టివేత

BC Reservations | రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీం షాక్​.. బీసీ రిజర్వేషన్లపై పిటిషన్​ కొట్టివేత

BC Reservations | బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్​ను ధర్మాసనం తోసిపుచ్చింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: BC Reservations | రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్​ లీవ్​ పిటిషన్​ను (Special Leave Petition) ధర్మాసనం కొట్టివేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన ధర్మాసనం బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం జారీ చేసిన జీవో నంబర్​ 9పై స్టే విధించింది. పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. అప్పటికే ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడగా.. హైకోర్టు తీర్పుతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను నిలిపివేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టను ఆశ్రయించింది.

BC Reservations | పాత రిజర్వేషన్ల ప్రకారం..

హైకోర్టు తీర్పుపై సోమవారం రాష్ట్ర ప్రభుత్వం (State Government) సుప్రీంలో స్పెషల్ లీవ్​ పిటిషన్​ వేసింది. దీనిపై గురువారం ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్​ లాయర్​ అభిషేక్​ సింఘ్వీ వాదనలు వినిపించారు. కుల గణన ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేసినట్లు తెలిపారు. హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరారు. పిటిషనర్​ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లు 50 శాతం మించకూడదనే సుప్రీం (Supreme Court) తీర్పులు స్పష్టంగా ఉన్నాయన్నారు. కేసు హైకోర్టులో పెండింగ్ ఉందని, బీసీ బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయని ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వ వాదనలను అంగీకరించని కోర్టు పిటిషన్​ను కొట్టేసింది.

అసలు చట్టం చేయకుండా జీవో ఎలా చేస్తారని కోర్టు ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లులు ఆమోదించినా.. గవర్నర్​, రాష్ట్రపతి పెండింగ్​లో పెట్టారని సింఘ్వీ వాదించారు. దీంతోనే ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు. అయితే 50 శాతం మించి రిజర్వేషన్లు అమలు చేయడానికి వీలు లేదని కోర్టు స్పష్టం చేసింది. ఈ కేసు ఇప్పటికే హైకోర్టులో పెండింగ్​లో ఉంది. అక్కడ విచారణ కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అవసరం అయితే పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీంతో స్థానిక ఎన్నికల ప్రక్రియ ఎలా ముందుకు వెళ్తుందోననే ఉత్కంఠ నెలకొంది.