ePaper
More
    HomeజాతీయంSupreme Court | సుప్రీంకోర్టు అసాధార‌ణ నిర్ణయం.. సీజేఐ బంగ్లాను స్వాధీనం చేసుకోవాల‌ని కేంద్రానికి లేఖ‌

    Supreme Court | సుప్రీంకోర్టు అసాధార‌ణ నిర్ణయం.. సీజేఐ బంగ్లాను స్వాధీనం చేసుకోవాల‌ని కేంద్రానికి లేఖ‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Supreme Court | దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అధికారిక నివాసాన్ని త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయాల‌ని మాజీ చీఫ్ జ‌స్టిస్ డీవై చంద్ర‌చూడ్‌కు (former Chief Justice DY Chandrachud) సుప్రీంకోర్టు ఆదివారం నోటీసులు జారీ చేసింది.

    అలాగే, చంద్ర‌చూడ్ ఉంటున్న ప్ర‌ధాన న్యాయ‌మూర్తి నివాసాన్ని త‌క్ష‌ణ‌మే స్వాధీనం చేసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వానికి లేఖ రాసింది. ప్రధాన న్యాయమూర్తి ఉండే అధికారిక నివాసాన్ని మాజీ సీజేఐ చంద్రచూడ్ (DY Chandrachud) తక్షణం ఖాళీ చేయాలని సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ఆ నివాసాన్ని ఖాళీ చేయడంతో పాటు కోర్టు హౌసింగ్ పూల్‌కు అందజేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

    Supreme Court | బంగ్లా ఖాళీ చేయ‌ని చంద్ర‌చూడ్‌..

    సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి అధికారిక నివాసం ఢిల్లీలోని కృష్ణ మీన‌న్ మార్గ్‌లో ఉంటుంది. చీఫ్ జ‌స్టిస్‌గా ఎవ‌రు బాధ్య‌త‌లు చేప‌ట్టినా వారికి ఈ బంగ్లాను కేటాయిస్తారు. అయితే, 50వ సీజేఐగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన చంద్ర‌చూడ్ ప‌దవీ విర‌మ‌ణ చేశారు. ఆయ‌న త‌ర్వాత సంజ‌య్ ఖ‌న్నా ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఆర్నెళ్లు ప‌ని చేశారు. ఆయ‌న కూడా రిటైర్ కాగా, 52వ సీజేఐగా బీఆర్ గ‌వాయ్ మే నెల‌లో బాధ్య‌త‌లు చేప‌ట్టారు. కాగా.. మాజీ సీజేఐ చంద్ర‌చూడ్ అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల్సి ఉండ‌గా ఇప్పటి వరకు వెకేట్​ చేయ‌లేదు.

    సుప్రీం కోర్టు న్యాయమూర్తుల (సవరణ) నిబంధనలు, 2022లోని నిబంధన 3B ప్రకారం, భారత రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ తర్వాత గరిష్టంగా ఆరు నెలల పాటు 5వ కృష్ణ మీనన్ మార్గ్ బంగ్లా కంటే ఒక స్థాయి తక్కువ ఉన్న టైప్ VII బంగ్లాను ఎంచుకోవ‌చ్చు. జస్టిస్ చంద్రచూడ్ స్థానంలో వచ్చిన మాజీ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా (Former Chief Justice Sanjiv Khanna) తన ఆరు నెలల పదవీకాలంలో అధికారిక వసతిలోకి మారలేదు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్​ కూడా గతంలో ఉన్న బంగ్లాలో ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారు. మ‌రోవైపు, నిబంధ‌న‌ల ప్ర‌కారం చంద్ర‌చూడ్ మే 31వ తేదీ లోపు అధికారిక బంగ్లాను వీడాల్సి ఉంది. కానీ ఆయ‌న వెళ్ల‌లేదు.

    Supreme Court | త‌క్ష‌ణ‌మే ఖాళీ చేయండి..

    గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ చంద్ర‌చూడ్ బంగ్లాను వీడక పోవ‌డంతో ఈ వ్య‌వ‌హారంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంది. త‌క్ష‌ణ‌మే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాల‌ని ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది. అలాగే, ఎలాంటి జాప్యం లేకుండా తక్షణం చంద్రచూడ్ ఉంటున్న నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలని కేంద్ర గృహా, పట్టణాభివృద్ధి శాఖకు (Union Ministry of Housing and Urban Development) సుప్రీంకోర్టు పరిపాలనా విభాగం జులై 1న లేఖ రాసింది.

    మ‌రోవైపు, తన కుమార్తెలకు ఉన్న ప్రత్యేక ఇబ్బందుల కారణంతోనే.. తాను ఆ నివాసం ఖాళీ చేయడం ఆలస్యమైందని జస్టిస్ చంద్రచూడ్ (Justice DY Chandrachud) తెలిపారు. గడువు ముగిసినా అధికారిక నివాసంలో ఉన్నారంటూ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉంటున్న ఇంటిని తక్షణ స్వాధీనానికి సుప్రీంకోర్టు లేఖ రాయడం అసాధారణమని న్యాయవర్గాలు చెబుతున్నాయి.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    Bodhan | బోధన్​లో ‘ఉగ్ర’​ లింకుల కలకలం

    అక్షరటుడే, బోధన్​ : Bodhan | నిజామాబాద్​ జిల్లా బోధన్​లో ఉగ్రవాద లింకులు కలకలం సృష్టించాయి. కేంద్ర దర్యాప్తు...

    Supreme Court | నేపాల్, బంగ్లాదేశ్ అల్లర్లను ప్రస్తావించిన సుప్రీంకోర్టు.. మన రాజ్యాంగాన్ని చూసి గర్విస్తున్నామన్న సీజేఐ గవాయ్

    అక్షరటుడే, వెబ్ డెస్క్: Supreme Court | భారతదేశ రాజ్యాంగం అత్యంత గొప్పదని, దాన్ని పట్ల ఎంతో గర్వంగా...

    Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజంపేట ఎస్సైపై వేటు..

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసులపై ఎస్పీ రాజేష్​ చంద్ర కొరడా ఝులిపించారు....