ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Supreme Court | తెలంగాణలో లోకల్​ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు

    Supreme Court | తెలంగాణలో లోకల్​ రిజర్వేషన్లపై సుప్రీం కీలక తీర్పు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | తెలంగాణలో స్థానికత (Locality) అంశంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. నీట్​ ర్యాంకుల ఆధారంగా మెడికల్​ కాలేజీల్లో సీట్ల భర్తీ విషయంలో స్థానికత అంశంపై పలువురు కోర్టును ఆశ్రయించారు.

    నీట్ (NEET) ర్యాంకుల ఆధారంగా రాష్ట్రంలో మెడికల్​ కాలేజీల్లో (Medical Colleges) సీట్లను భర్తీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో 9, 10వ తరగతులు, ఇంటర్​ ఫస్ట్​, సెకండియర్​ చదివిన వారు మాత్రమే స్థానిక రిజర్వేషన్​కు అర్హులని గతంలో ప్రభుత్వం జీవో 33 జారీ చేసింది. దీనిపై కొందరు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు వారికి అనుకూలంగా తీర్పు చెప్పడంతో ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించింది.

    Supreme Court | నాలుగేళ్ల స్థానికత తప్పనిసరి

    మెడికల్​ కాలేజీ సీట్ల భర్తీ విషయంలో స్థానిక రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఆగస్టు 5న వాదనలు ముగిశాయి. అప్పుడు తీర్పు రిజర్వ్​ చేసిన ధర్మాసనం సోమవారం వెలువరించింది. విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి బీఆర్​ గవాయి (CJI BR Gavai) కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ విద్యార్థులు ఇంటర్​ ఇతర రాష్ట్రంలో చదివితే నష్టపోతారని వ్యాఖ్యానించారు. అయితే తాజాగా ప్రభుత్వ జీవోను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు ఆదేశాలను కొట్టేసింది. లోకల్‌ రిజర్వేషన్లు పొందాలంటే 9వ తరగతి నుంచి 12 వరకు తెలంగాణలో చదవాల్సిందే అని సుప్రీం స్పష్టం చేసింది.

    Supreme Court | వారికి నష్టం..

    ప్రస్తుతం పదో తరగతి వరకు స్థానికం చదివిన విద్యార్థులు ఇంటర్​ కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు. ముఖ్యంగా నీట్​లో ర్యాంక్​ కొట్టాలనుకునే విద్యార్థులు కోచింగ్​ బాగా ఉండే స్టేట్​లను ఎంచుకుంటున్నారు. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పుతో వారికి నష్టం జరగనుంది. తొమ్మిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలంగాణలో చదివిన వారికి మాత్రమే వైద్య కాలేజీ సీట్ల భర్తీలో లోకల్​ రిజర్వేషన్ వర్తించనుంది.

    More like this

    Indian Hockey Team | ఆసియా క‌ప్‌లో చ‌రిత్ర సృష్టించిన భారత్.. ఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా చిత్తు

    indian hockey team | భారత హాకీ Hockey జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ Asia Cup...

    Kaloji Literary Award | రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి వరించిన ప్రజాకవి కాళోజీ సాహితీ పురస్కారం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaloji Literary Award | ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు Kaloji Narayana...

    Madhuyaski Goud | కామారెడ్డి ప్రజలను కేసీఆర్ పరామర్శించకపోవడం సరికాదు : మధుయాస్కి గౌడ్

    అక్షరటుడే, కామారెడ్డి : Madhuyaski Goud : కామారెడ్డి నుంచి పోటీ చేసిన కేసీఆర్.. ఇక్కడ వరదలతో ఇబ్బందులు...