అక్షరటుడే, వెబ్డెస్క్ : Note for Vote Case | తెలంగాణ(Telangana)లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో జెరూసలెం మత్తయ్యకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రాష్ట్ర ప్రభుత్వం(State Government) దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.
బీఆర్ఎస్ మొదటి సారి అధికారంలోకి వచ్చిన సమయంలో ఓటు నోటు కేసు(Note for Vote Case) వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీడీపీ నాయకులు తమకు ఓటు వేయాలని నామినేటెడ్ ఎమ్మెల్యే స్టిఫెన్ సన్కు డబ్బులు ఇచ్చినట్లు కేసు నమోదైంది. ఈ కేసులో టీడీపీ నాయకులు, స్టిఫెన్సన్కు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు మత్తయ్యపై కేసు నమోదు అయింది. అయితే ఆయనపై దాఖలైన ఎఫ్ఐఆర్ను హైకోర్టు(High Court) గతంలోనే కొట్టి వేసింది. దీంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వ పిటిషన్ను శుక్రవారం కొట్టేసింది.
Note for Vote Case | 2016లో పిటిషన్
ఈ కేసులో మత్తయ్యపై 2016లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. దీనిని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏసీబీ 2016 జులై 6వ తేదీన సుప్రీంకోర్టు(Supreme Court)లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసులో ఈ నెల 22న వాదనలు ముగిశాయి. శుక్రవారం ధర్మాసనం తీర్పు వెలువరించింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి వాదించారు. ఈ కేసులో ఏ2గా ఉన్న సెబాస్టియన్, ఏ4 మత్తయ్య దాదాపుగా ఇరవై సార్లు ఫోన్లలో మాట్లాడుకున్నారని తెలిపారు. దానిపై దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
Note for Vote Case | ‘ఆయనను ఇరికించారు’
హైకోర్టు మత్తయ్యను విచారించాల్సిన అవసరాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఎఫ్ఐఆర్ కొట్టివేసిందని మేనక గురుస్వామి అన్నారు. అయితే ఈ వాదనలను మత్తయ్య(Jerusalem Matthayya) తరఫు న్యాయవాది ఖండించారు. ఆయన అసలు క్రైమ్ సీన్లోనే లేరని, కేసులో ఇరికించారని వాదించారు. ఇరువరి వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది. తాజాగా తుది తీర్పు చెప్పింది. హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ప్రభుత్వం వేసిన పిటిషన్ కొట్టివేసింది.