Homeజిల్లాలునిజామాబాద్​Babli gates | భారీ వరద.. బాబ్లీ గేట్లు మూసేయని అధికారులు

Babli gates | భారీ వరద.. బాబ్లీ గేట్లు మూసేయని అధికారులు

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం బాబ్లీ గేట్లు మంగళవారం అర్ధరాత్రి మూసివేయాల్సి ఉంది. కానీ బాబ్లీకి ఎగువ నుంచి వరద వస్తుండడంతో అధికారులు నాలుగు గేట్లు తెరిచి ఉంచి, మిగతా గేట్లను కొద్దిమేర మూసి వేశారు.

- Advertisement -

అక్షరటుడే, బాల్కొండ: Babli gates | శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు (Sriramsagar project) ఎగువన ఉన్న బాబ్లీ గేట్లను సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఏడాది అక్టోబర్​ 28వ తేదీ ఆర్ధరాత్రి మూసివేయాల్సి ఉంటుంది. ఈ మేరకు తెలంగాణ (Telangana), మహారాష్ట్ర అధికారులు కలిసి ప్రాజెక్టు గేట్లను మూసివేస్తుంటారు. రాష్ట్రాలకు నీటి విభజనలో తేడా రాకుండా సుప్రీంకోర్టు (Supreme Court) ఈ నిబంధన విధించింది.

Babli gates | వరద పోటెత్తుతుండడంతో..

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాబ్లీ గేట్లు (Babli gates) అక్టోబర్​ 28న మూసివేయాల్సి ఉంది. అధికారులు సైతం 29వ తేదీ ఉదయమే బాబ్లీ వద్దకు చేరుకున్నారు. కానీ ఎగువ నుంచి భారీ ఇన్​ఫ్లో ఉండడంతో ఇరురాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు చర్చించుకున్నారు. అనంతరం నాలుగు గేట్లను పూర్తిగా ఎత్తి.. మిగిలిన గేట్లను కొద్దిమేర కిందికి దించారు. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ ఎస్​ఈ జగదీష్​, సీడబ్ల్యూసీ ఈఈ ఫ్రాంక్లిన్​, నాందేడ్​ ఈఈ బన్సాద్​, ఎస్సారెస్పీ ఏఈఈ కొత్త రవి, సీడబ్ల్యూసీ ఎస్​డీఈ సతీష్​ తదితరులు పాల్గొన్నారు.