అక్షరటుడే, వెబ్‌డెస్క్: Aravalli Mountains | ఆరావళి పర్వతాల నిర్వచనంపై గతంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును తాజాగా సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నిలిపి వేసింది. కేంద్రంతో పాటు సంబంధిత రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
పలు రాష్ట్రాలకు రక్షణకవచంగా ఉన్న ఆరావళి పర్వతాల్లో మైనింగ్ (Mining) చేపడుతారని ఇటీవల ప్రచారం జరిగింది. పర్వతాల ఎత్తు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనానికి సుప్రీం నవంబర్‌లో ఆమోదం తెలిపింది. కేంద్రం ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన చెందారు. ఆరావళి పర్వతాల రక్షణ కోసం నిరసనలు తెలిపారు. దీంతో ఆరావళి కొండల నిర్వచనానికి సంబంధించిన సమస్యలకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు సుమోటో (Sumoto)గా విచారిస్తోంది.
Aravalli Mountains | సీజేఐ నేతృత్వంలో..
భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) సూర్యకాంత్, న్యాయమూర్తులు JK మహేశ్వరి, AG మసీహ్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. ఆరావళి పర్వతాలు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్‌లలో విస్తరించి ఉన్నాయి. మైనింగ్ నియంత్రణ కోసం ఆరావళి కొండలలో భాగంగా భూస్వరూపాలను వర్గీకరించడానికి ఉన్నత న్యాయస్థానం గతంలో ఒక ఎత్తు-సంబంధిత నిర్వచనాన్ని ఆమోదించింది. వంద మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కొండలనే పర్వతాలు అనాలని సుప్రీం గతంలో పేర్కొంది. 100 మీటర్లు, అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉన్న కొండలుగా పిలవాలని తెలిపింది. దీంతో ఆరావళి పర్వతాల్లో మైనింగ్‌కు అనుమతులు ఇస్తారని ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆరావళి శ్రేణుల్లో మైనింగ్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Aravalli Mountains | కమిటీని ఏర్పాటు చేయాలి
ఆరావళి కొండలు, పర్వత శ్రేణులకు సంబంధించి నవంబర్ 20 తీర్పులోని ఆదేశాలను సుప్రీంకోర్టు సోమవారం నిలిపివేసింది. ఈ సమస్యపై సమగ్రంగా పరిశీలన జరపడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు ప్రశ్నలు వేసింది. ఆరావళి అరవళి శ్రేణి నిర్వచనాన్ని 500 మీటర్ల ప్రాంతానికి పరిమితం చేయడంతో పరిరక్షణ మండలాన్ని కుదించడం ద్వారా ఒక నిర్మాణాత్మక వైరుధ్యం ఏర్పడుతుందా అని ప్రశ్నించింది. అటువంటి నిర్వచనం నియంత్రిత మైనింగ్‌కు అనుమతి ఇవ్వగల ప్రాంతాల పరిధిని విస్తరించిందా అని అడిగింది. అనంతరం విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.