HomeUncategorizedSupreme Court | ఏపీ, తెలంగాణ‌కు సుప్రీంకోర్టు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు పిటిష‌న్ల కొట్టివేత‌

Supreme Court | ఏపీ, తెలంగాణ‌కు సుప్రీంకోర్టు షాక్‌.. నియోజ‌క‌వ‌ర్గాల పెంపు పిటిష‌న్ల కొట్టివేత‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Supreme Court | తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్(Andhra Pradesh) రాష్ట్రాల‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న చేప‌ట్టాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌ను స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం కొట్టేసింది. ఏపీ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టంలోని సెక్ష‌న్ 26 ప్ర‌కారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలని ఆదేశాలు ఇవ్వాల‌ని ప్రొఫెస‌ర్ పురుషోత్తంరెడ్డి(Professor Purushottam Reddy) 2022లో సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేశారు. దీనిని విచారించిన జ‌స్టిస్ సూర్య‌కాంత్‌, జ‌స్టిస్ కోటేశ్వ‌ర్‌సింగ్ ధ‌ర్మాస‌నం సుప్రీంకోర్టు కొట్టేవేసింది.

Supreme Court | పున‌ర్విభ‌జ‌న్ చేప‌ట్టాల‌ని..

జ‌మ్మూకాశ్మీర్‌లో పున‌ర్విభ‌జ‌న చేసిన స‌మ‌యంలో ఏపీ విభ‌జ‌న చ‌ట్టాన్ని ప‌క్క‌న పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించార‌ని పిటిష‌న‌ర్ పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ(Telangana) లను మినహాయించి కొత్తగా రూపొందించిన జమ్ము కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గం మాత్రమే పునర్విభజన చేయడం అసమంజసమని వాదించారు. కానీ పిటిష‌న‌ర్ వాదనను సుప్రీంకోర్టు(Supreme Court) తోసిపుచ్చింది. ఆర్టికల్ 170(3) ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై పరిమితులు ఉండే అవకాశముందని పేర్కొంది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం ఇచ్చిన ప్రతిపాదనలో మార్పులు చేయడం కేంద్రం నిబంధనల ప్రకారమేనని వివరించింది. 2026లో మొద‌టి జ‌న గ‌ణ‌న త‌ర్వాత మాత్ర‌మే డీలిమిటేష‌న్(Delimitation) ప్ర‌క్రియ నిర్వ‌హిస్తామ‌ని చ‌ట్టంలో స్ప‌ష్టంగా పేర్కొన్న‌ట్లు గుర్తు చేసింది.

Supreme Court | పోలిక త‌గ‌దు..

ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చుకోవ‌డం త‌గ‌ద‌ని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం పేర్కొంది. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమ‌తించ‌డం వ‌ల్ల ఇత‌ర రాష్ట్రాల్లో కూడా నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్వ‌భ‌జ‌న చేప‌ట్టాల‌న్న వ్యాజ్యాలు వెల్లువెత్తుతాయ‌ని, గేట్లు తెరిస్తే వ‌ర‌ద‌లా వ‌చ్చి ప‌డ‌తాయ‌ని తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతాల‌తో పోల్చిన‌ప్పుడు రాష్ట్రాల్లో డీలిమిటేష‌న్‌కు సంబంధించిన నిబంధ‌న‌లు భిన్నంగా ఉంటాయ‌ని పేర్కొంది. జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ రాజ్యాంగ పరిధిలోనే జరిగిందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో జరిగిన పునర్విభజనను తెలుగు రాష్ట్రాలతో పోల్చడం తగదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఏపీ, తెలంగాణలను పునర్విభజన నోటిఫికేషన్‌(Redistribution Notification) నుండి మినహాయించడంలో కేంద్రానికి ప్రత్యేక ఉద్దేశ్యం లేదని, ఇందులో రాజ్యాంగ విరుద్ధత లేదని సుప్రీంకోర్టు తేల్చింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఆశల‌పై నీళ్లు చల్లినట్లైంది. 2027 త‌ర్వాతే నియోజ‌క‌వ‌ర్గాల పెంపు అమ‌లులోకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది.