అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court Premarital Relationship | పెళ్లికి ముందు సహజీవనం, శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం చాలా మంది పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొంటున్నారు. అనంతర వివిధ కారణాలతో పెళ్లి చేసుకోకపోతే యువతులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి కేసు తాజాగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది.
పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి, ఆ తర్వాత మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడని ఓ యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ దరఖాస్తును జస్టిస్‌లు బి.వి. నాగరత్న, ఉజ్జల్ భూయాన్లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. ఈ సందర్భంగా వివాహానికి ముందు శారీరక సంబంధం విషయంలో జాగ్రత్త వహించాలని జస్టిస్ బి.వి. నాగరత్న (Justice B.V. Nagaratna) పేర్కొన్నారు.
Supreme Court Premarital Relationship | పాత కాలం వాళ్లమేమో..
మనం పాత ఫ్యాషన్ అయినా, పెళ్లికి ముందు ఒక అబ్బాయి, అమ్మాయి అపరిచితులు అని కోర్టు పేర్కొంది. ‘‘వారి సంబంధం ఎంత బలంగా ఉన్నా, ఎంత సన్నగా ఉన్నా.. వివాహానికి ముందు శారీరక సంబంధంలో ఎలా మునిగిపోతారో మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. బహుశా మనం పాతకాలపు వాళ్ళమే కావచ్చు… మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, పెళ్లికి ముందు ఎవరూ ఎవరినీ నమ్మకూడదు” అని జస్టిస్ నాగరత్న అన్నారు.
Supreme Court Premarital Relationship | దుబాయి ఎందుకు వెళ్లారు
మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ వెబ్సైట్ ద్వారా స్త్రీ, పురుషుడు కలుసుకున్నారు. వివాహం చేసుకుంటానని హామీ ఇచ్చి ఢిల్లీలో, దుబాయ్ (Dubai)లో ఆమెతో పదేపదే శారీరక సంబంధం పెట్టుకున్నాడని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఆ వ్యక్తికి చాలా కాలం క్రితం వివాహం అయిందని, 2024లో పంజాబ్‌లో మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఆ మహిళ కనుగొన్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. సదరు మహిళ అతడిని కలవడానికి దుబాయ్‌కు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఇద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నప్పుడు ముందుగా వెళ్లకూడదన్నారు. వారిని మధ్యవర్తిత్వానికి పంపుతామని తెలిపింది. ఏకాభిప్రాయ సంబంధం ఉన్నప్పుడు విచారించి దోషులుగా నిర్ధారించాల్సిన కేసులు కావని ధర్మాసనం వ్యాఖ్యానించింది.