అక్షరటుడే, హైదరాబాద్: Supreme Court | గ్రూప్-1 నియామకాల Group-1 appointments పై స్టే విధించేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తెలంగాణ Telangana హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది తీర్పునకు అనుగుణంగా గ్రూప్-1 నియామకాలు ఉండాలని సూచించింది.
Supreme Court | స్టే విధించాలని..
గ్రూప్-1 పోస్టలు భర్తీపై ఇటీవల హైకోర్టు High Court డివిజన్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సరికాదంటూ పలువురు అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఎంపిక అయిన అభ్యర్థులకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులకు అనుగుణంగా నియామక పత్రాలు ఇవ్వడంపై స్టే విధించాలని విన్నవించారు. అభ్యర్థుల పిటిషన్పై ఈ రోజు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్య బాగ్జిల ధర్మాసనం విచారణ చేపట్టింది.
డివిజన్ బెంచ్ మధ్యంతర ఆదేశాలు ఇవ్వడంపై అభ్యర్థుల తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నియామకాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు.
1 comment
[…] జీవోపై స్టే విధించడం, సుప్రీంకోర్టు (Supreme Court) సైతం ప్రభుత్వ పిటిషన్ను […]
Comments are closed.