అక్షరటుడే, న్యూఢిల్లీ: Supreme Court : నోట్ల కట్టల వివాదం విషయంలో జస్టిస్ యశ్వంత్ వర్మ (Justice Yashwant Verma) పై ఎఫ్ఐఆర్ FIR నమోదు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. కాగా, దీనిపై సరైన సమయంలో విచారణ చేపడతామని మాత్రం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో సోమవారం (జులై 21) న్యాయవాది, పిటిషనర్ మాథ్యూస్ నెడుంపర (lawyer and petitioner Mathews) తీరుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. జస్టిస్ వర్మను న్యాయవాది మాథ్యూస్ కేవలం వర్మ అంటూ సంబోధించడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ (Chief Justice Justice BR Gavai), జస్టిస్ కేవీ చంద్రన్(Justice KV Chandran) ధర్మాసనం తప్పుబట్టింది.
Supreme Court : ఆయన మీకు స్నేహితుడా..
‘కేవలం వర్మ అని సంబోధిస్తున్నారు.. ఆయనేమైనా మీకు స్నేహితుడా.. ?’ అని ధర్మాసం ప్రశ్నించింది. ఇప్పటికీ ఆయన జస్టిస్ వర్మనేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ‘ఒక కోర్టులో ఆయన న్యాయమూర్తిగా ఉన్నారు. ఎంతో సీనియర్ అయిన జస్టిస్ వర్మను అలా ఎలా సంబోధిస్తారు? ఈ విషయంలో కాస్త మర్యాదగా వ్యవహరించండి’ అంటూ ధర్మాసనం హితవు పలికింది.
Supreme Court : న్యాయవాది తీరుపై ఆగ్రహం..
దీనికి న్యాయవాది మాథ్యూస్ కూడా తీవ్రంగా స్పందించారు. ఆయనకు అంత గౌరవం అవసరం లేదని న్యాయవాది అన్నారు. పిటిషన్పై విచారణ చేపట్టండని నెడుంపర పేర్కొన్నారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ చంద్రన్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. మాకు మీరు ఆదేశాలివ్వక్కర్లేదంటూ మండిపడింది.
జస్టిస్ వర్మ వివాదానికి సంబంధించి న్యాయవాది మూడు పిటిషన్లు వేయడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణ కోసం మాథ్యూస్ నెడుంపర పట్టుబట్టడంతో ఇప్పుడే పిటిషన్ను కొట్టివేయమంటారా? అని ధర్మాసనం ప్రశ్నించింది.
తదుపరి సీజేఐ గవాయ్ మాట్లాడుతూ.. పిటిషన్ కొట్టి వేయడం అసాధ్యమన్నారు. ఎఫ్ఐఆర్ నమోదవ్వాల్సిందేనన్నారు. జస్టిస్ వర్మ సైతం ఇదే కోరుతారనిపిస్తోందన్నారు. ఎఫ్ఆర్, దర్యాప్తు జరగాలని సీజేఐ CJI పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ నివేదికను పక్కనబెట్టాలంటూ జస్టిస్ వర్మ ఇటీవల దేశ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అలా వ్యాఖ్యానించింది.