అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు సుప్రీంకోర్టు (Supreme Court) నోటీసులు జారీ చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని కేటీఆర్ గతంలో ఆరోపణలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ (aatram suguna) ఉట్నూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు చెప్పింది. దీంతో ఆత్రం సుగుణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం సమాధానం చెప్పాలని కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది.
