HomeతెలంగాణPalamuru Ranga Reddy | ‘పాలమూరు రంగారెడ్డి’ పై పిటిషన్​ కొట్టేసిన సుప్రీంకోర్టు

Palamuru Ranga Reddy | ‘పాలమూరు రంగారెడ్డి’ పై పిటిషన్​ కొట్టేసిన సుప్రీంకోర్టు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Palamuru Ranga Reddy | పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్​పై దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు (suprem court) కొట్టివేసింది. ఈ ప్రాజెక్టు పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం (state governament) భారీ అవినీతికి పాల్పడిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నాగం జనార్దన్‌రెడ్డి 2019 మార్చిలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్​ను విచారించిన జస్టిస్​ బీవీ నాగరత్న (Justice B.V. Nagaratna) ఆరోపణలు తప్పా ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి లేదని సెంట్రల్ విజిలెన్స్ కమిటీ (సీవీసీ) తేల్చి చెప్పిందని, సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడం కుదరదని తేల్చి చెప్పింది. ఇదే అంశంపై పిటిషనర్ అనేక పిల్​లు దాఖలు చేశారని గుర్తు చేసింది. హైకోర్టు అన్నిటిని కొట్టిసిందని, హైకోర్టు తీర్పులో తాము జోక్యం చేసుకోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్​కు అర్హత లేదని పేర్కొంటూ కోర్టు కొట్టివేసింది.