అక్షరటుడే, వెబ్డెస్క్: Free Scheme Criticism | ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని పేర్కొంది.
తమిళనాడు (Tamilnadu) విద్యుత్ బోర్డు వినియోగదారులకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. విద్యుత్ సవరణ నియమాలు 2024లోని రూల్ 23ని సవాలు చేస్తూ తమిళనాడు విద్యుత్ పంపిణీ కంపెనీ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జోయ్మల్య బాగ్చి, జస్టిస్ విపుల్ (Justice Whipple) పంచోలిలతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ఉచిత పథకాలతో పలు రాష్ట్రాలు ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయని తెలిపింది. ఈ పథకాలు ధనవంతులకు కూడా అందుతున్నాయని, అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని అభిప్రాయ పడింది.
Free Scheme Criticism | ఎన్నికల ముందే ఎందుకు?
ఉచిత విద్యుత్తును అందించాలని ప్రతిపాదించిన డీఎంకే ప్రభుత్వం (DMK Government) చేసిన విజ్ఞప్తిపై సుప్రీంకోర్టు కేంద్రం, ఇతరులకు నోటీసు జారీ చేసింది. రాష్ట్రాలు, రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న ఉచితాల సంస్కృతిని ధర్మాసనం విమర్శించింది. ఇది ఆర్థికాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని పేర్కొంది. దేశంలోని చాలా రాష్ట్రాలు రెవెన్యూ లోటులో ఉన్నప్పటికీ అభివృద్ధిని పట్టించుకోకుండా అలాంటి ఉచితాలను అందిస్తున్నాయని సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్నికల ముందే ఉచిత పథకాలు ఎందుకు తెరపైకి వస్తున్నాయని ప్రశ్నించింది. ఇటీవలి ఎన్నికలలో కొన్ని రాష్ట్రాల్లో అకస్మాత్తుగా సంక్షేమ పథకాలు ప్రకటించారని గుర్తు చేసింది.
అన్ని రాష్ట్రాల్లోఈ సమస్య ఏ ఒక్క రాష్ట్రానికో పరిమితం కాలేదని, దేశంలోని అన్ని రాష్ట్రాలకూ పరిమితం అయిందని కోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు సందర్భాన్ని మాత్రమే పరిగణించడం లేదని, ఎన్నికలకు ముందు పథకాలు ఎందుకు ప్రకటిస్తున్నామనే దానిపై దృష్టి సారించినట్లు ధర్మాసనం పేర్కొంది. అన్ని రాజకీయ పార్టీలు, సామాజిక శాస్త్రవేత్తలు భావజాలాన్ని పునఃసమీక్షించుకోవాలని సూచించింది.