అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పట్టణంలోని స్థానిక జీవధాన్ హైస్కూల్లో (Jeevadan High School) మంగళవారం సపోజ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు క్రిస్మస్ సెలవులు (Christmas holidays) ఉండడంతో ముందస్తుగానే పాఠశాలలో విద్యార్థులతో వేడుకలను జరుపుకున్నారు.
Yellareddy | విద్యార్థులకు క్రీస్తు సందేశం..
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తహశీల్దార్ ప్రేమ్, పాఠశాల ప్రిన్సిపాల్ ఫాదర్ బాబు, వైస్ ప్రిన్సిపాల్ ఫాదర్ జోభిష్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. క్రిస్మస్ కేక్ (Christmas cake) కట్ చేసిన అనంతరం శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత పాఠశాల యాజమాన్యం అతిథులకు శాలువా కప్పి మెమోంటోలతో సత్కరించింది. అనంతరం విద్యార్థులకు క్రీస్తు సందేశం వినిపించారు.
Yellareddy | అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు..
వేడుకల్లో భాగంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు అందరినీ అలరించాయి. విద్యార్థులు క్రీస్తు జన్మ వృత్తాంతాన్ని కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. శాంటాక్లాజ్ విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు షాదుల్లా, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.
