అక్షరటుడే, కామారెడ్డి: Minister Nitin Gadkari | భారీ వర్షాలు కామారెడ్డి నియోజకవర్గాన్ని (Kamareddy constituency) అతలాకుతలం చేశాయి. వరదల ధాటికి నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. ఇప్పటికే నష్టం అంచనా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించేందుకు అధికారులు సిద్ధం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా కేంద్రం నిధులు రాబట్టేలా కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) తనవంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. కామారెడ్డిలో సంభవించిన విపత్తు, జరిగిన నష్టాన్ని కేంద్ర మంత్రులకు వివరిస్తున్నారు.
సోమవారం కేంద్ర మంత్రులు రూపాల, కిషన్ రెడ్డిలను కలిసిన ఎమ్మెల్యే మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని (Transport and Highways Minister Nitin Gadkari) కలిశారు. నియోజకవర్గంలో వరదల వల్ల దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు దారుణంగా ఉన్నాయని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని కోరారు.
Minister Nitin Gadkari | రింగు రోడ్డు నిర్మించండి
కామారెడ్డి జిల్లా కేంద్రం అయిన తర్వాత పట్టణంలో విపరీతమైన వాహనాల రద్దీ కొనసాగుతోంది. రోడ్లు వెడల్పు లేక ట్రాఫిక్ ఇబ్బందులు (Traffic problems) తలెత్తుతున్నాయి. భారీ వాహనాలు సైతం కామారెడ్డి పట్టణం నడిబొడ్డున నుంచే వెళ్లడంతో వాహనాల రద్దీ తీవ్రమవుతోంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకున్న ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి కామారెడ్డి ఔటర్ రింగు రోడ్ (Kamareddy Outer Ring Road) కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కామారెడ్డికి రింగు రోడ్డు కావాలని వాటి ప్లాన్, మ్యాప్లు, డీపీఆర్ అంచనా వ్యయం చేయించి కేంద్ర మంత్రికి వివరించారు. సుమారు రూ.510 కోట్లతో 54 కిలోమీటర్ల పొడవు ఉన్న ఔటర్ రింగు రోడ్డు కామారెడ్డి పట్టణం చుట్టూరా అవసరం ఉందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.