అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Constable Soumya | హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు వైద్య ఖర్చుల నిమిత్తం నిధులు మంజూరు చేసినట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు చేస్తుండగా గంజాయి తరలిస్తున్న వ్యక్తులు కారుతో ఢీకొట్టిన సంఘటనలో కానిస్టేబుల్ సౌమ్య (Constable Soumya) తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ఆమెకు మొదట నిజామాబాద్‌లోని ఆస్పత్రిలో చికిత్స అందిచిన అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరబాద్‌లోని నిమ్స్‌లో అడ్మిట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె చికిత్సకు రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Constable Soumya | సీఎం ఆదేశాలు
కానిస్టేబుల్ సౌమ్య ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతోందని.. ఆమెకు మరింత మెరుగైన వైద్యసేవల కోసం అవసరమైన తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కలెక్టర్ తెలిపారు. సౌమ్య ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారని చెప్పారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా నిమ్స్ ఆస్పత్రి వర్గాలను ఆదేశించారన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని కలెక్టర్ భరోసా కల్పించారు.